టాలీవుడ్ లో మరో స్టార్ వెడ్డింగ్ కి రంగం సిద్ధమవుతోంది. అల్లు కుటుంబానికి చెందిన యంగ్ హీరో అల్లు శిరీష్ తన ఎంగేజ్మెంట్ని అధికారికంగా ప్రకటించాడు. శిరీష్ పారిస్ లోని ప్రఖ్యాత ఐఫిల్ టవర్ వద్ద తన ప్రేయసి నైనిక చేయి పట్టుకుని తీసుకున్న ఫోటోను సోషల్ మీడియాలో పంచుకున్నాడు. ఇద్దరూ అక్టోబర్ 31న ఎంగేజ్ అవ్వబోతున్నట్టు ప్రకటించాడు.
ఫోటోతో పాటు శిరీష్ ఒక భావోద్వేగపూర్వకమైన నోట్ కూడా రాశాడు. తన తాతగారు, లెజెండరీ నటుడు డాక్టర్ అల్లు రామలింగయ్య గారి జయంతి సందర్భంగా జీవితంలోనే అత్యంత ప్రత్యేకమైన క్షణాన్ని అందరితో పంచుకోవాలని అనుకున్నానని పేర్కొన్నాడు.
ఇక నైనిక హైదరాబాద్కు చెందిన అమ్మాయి అని సమాచారం. కానీ ఆమె గురించి మరిన్ని వివరాలు మాత్రం త్వరలో వెలువడనున్నాయి.