Native Async

ఆటోలయందు ఈ ఆటో వేరయా…

Auto Rickshaw Spreads Sanatan Dharma with Bhagavad Gita Shlok and Meaning
Spread the love

ఆటో వెనుక మనం చూసే స్లోగన్లు చాలా వేరుగా ఉంటాయి. నేనే మార్గం, సత్యమేవ జయతే… నన్ను చూసి ఏడవకండి ఇలాంటి స్లోగన్లు కనిపిస్తుంటాయి. రెగ్యులర్‌గా ఇలాంటి వాటిని మనం చూస్తుంటాం. కొన్ని కొత్త కొత్త స్లోగన్లును కూడా ఉపయోగిస్తుంటాయి. వాటిని జబర్ధస్త్‌ వంటి కామెడీ షోలలో కూడా వాడుతుంటారు. ఇదంతా రెగ్యులర్‌ ఫార్మాట్‌. కానీ, సనాతన ధర్మాన్ని చాటి చెప్పడం కోసం, సనాతన ధర్మానికి నాంధిగా నిలిచిన భగవద్గీతను అందరూ తెలుసుకోవాలి, అందులోని అర్ధం అందరికీ తెలియాలి అనే ఉద్దేశంలో తెలుగు రాష్ట్రానికి చెందిన ఓ ఆటోవాలా తన ఆటో వెనుక భాగంలో ఓ బ్లాక్‌ బోర్డును ఏర్పాటు చేసి, దానిపై భగవద్గీత శ్లోకం, దాని అర్ధాన్ని వివరంగా రాశాడు. ప్రస్తుతం ఈ ఆటో సనాతన ధర్మానికి ప్రతీకగా నిలుస్తోంది. సోషల్‌ మీడియాలో ఈ ఆటో గురించి పదిమంది చర్చించుకుంటున్నారు. తమకు తోచిన విధంగా సనాతన ధర్మం గురించి మాట్లాడుకోవడమే కాదు, ఇలా ప్రచారం కూడా చేయాలని ఆటోవాలా నిరూపించాడు. వీలైతే మనం కూడా మనకు తోచిన విధంగా ధర్మాన్ని ప్రచారం చేసేందుకు ప్రయత్నిద్దాం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

🔔 Subscribe for Latest Articles
Share: FacebookX/TwitterTelegramWhatsAppLinkedInReddit