Native Async

సిరిమానోత్సవం రూట్‌మ్యాప్‌ ఖరారు

Sirimanotsavam 2025 Route Map Finalized in Vizianagaram – Full Details
Spread the love

విజయనగరం పైడతల్లి సిరిమానోత్సవంకు వచ్చే భక్తుల సౌకర్యార్ధం వీలుకోసం వాహనాల పార్కింగ్ ను నిర్దేశించిన ప్రాంతాలలో మాత్రమే పెట్టాలని ఎస్పా దామోదర్ శుక్రవారం అన్నారు. స్థానిక డీపీఓలోని తన ఛాంబర్ లో ఏఎస్పీ సౌమ్యలతతో ముందు భటే అయినతర్వాత సిద్దం చేసిన పార్కింగ్ ప్రణాళికతో ఎస్పీ దామోదర్ ను విజయనగరం వన్ టౌన్,టూటౌన్,రూరల్, ట్రాఫిక్ సీఐలు ఆర్వీకే.చౌదరి,శ్రీనివాస్,లక్ష్మణరావు,సూరినాయుడులు చర్చించారు.ఈ సందర్బంగా ఎస్పీ దామోదర్ మాట్లాడుతూ ఈనెల 7 వ తేదీన శ్రీశ్రీశ్రీ పైడితల్లి అమ్మ సిరిమానోత్సవం సందర్బంగా దర్శనార్ధం వాహనాలలో వచ్చు భక్తులు పార్కింగ్ చేసుకొనుటకు పలు పార్కింగ్ ప్రదేశాలను ఏర్పాటు చేసామన్నారు.

విశాఖపట్నం, కోరుకొండ , జామి , అలమండ , కొత్తవలస పరిసర ప్రాంతాలు నుంచీ వచ్చే వాళ్లందరూ ఎత్తు బ్రిడ్జి మీదుగా మయూరి జంక్షన్ ,ఆర్టీసీ కాంప్లెక్స్ , బాలాజీ జంక్షన్,ఐస్ ఫ్యాక్టరీ జంక్షన్ వైపు గా అక్కడ ఏర్పాటు చేసిన కాశి రాజు సర్కస్ గ్రౌండ్ అయోద్యమైదానం ,ఎంఆర్ కాలేజ్ బాయ్స్ హాస్టల్ లలో తమ వాహనాలు ను పార్కింగ్ చేయాలన్నారు.అలాగే ధర్మపురి , డెంకాడ మరియు పరిసర ప్రాంతాలనుంచీ వాహనాలు ఐస్ ఫ్యాక్టరీ జంక్షన్ మీదుగా కాశి రాజు సర్కస్ గ్రౌండ్ అయోద్యమైదానం ,ఎంఆర్ కాలేజ్ బాయ్స్ హాస్టల్ లలో వద్ద ఏర్పాటు చేసిన పార్కింగ్ ప్రదేశాలలో వాహనాలను పార్క్ చేయాలన్నారు.ఇక డెంకాడ ,నాతవలస , శ్రీకాకుళం , భోగాపురం పరిసర ప్రాంతాలు నుంచీ వచ్చే వాహనాలు రాజీవ్ నగర్ కాలనీ జంక్షన్ – దాసన్నపేట జంక్షన్ మీదుగా అయ్యకోనేరువద్ద ఏర్పాటు చేసిన పార్కింగ్ స్థలం లో గాని లేదా రాజీవ్ నగర్ జంక్షన్ మీదుగా రింగ్ రోడ్డు మీదుగా పోర్ట్ సిటీ స్కూల్ , ఎస్వీఎన్ లేఔట్ లో ఏర్పాటు చేసిన పార్కింగ్ స్థలాలు లో తమ వాహనలును పార్కింగ్ చేయాలన్నారు.ఇక నెల్లిమర్ల , చీపురుపల్లి, రాజం , గరివిడి , గుర్ల పరిసర ప్రాంతాలు వైపు నుంచీ వచ్చే వాహనాలు కొత్తపేట నీళ్ళ ట్యాంక్ జంక్షన్ మీదగా , కొత్తపేట- మండపం – పాత బస్టాండ్ మీదుగా రాజీవ్ స్పోర్ట్స్ స్టేడియం , డీఎస్డీఓ ఇండోర్ స్టేడియం లో పార్కింగ్ చేయాలన్నారు.ఇకగజిపతినగరం , బొబ్బిలి , సాలూరు , పార్వతీపురం, గంట్యాడ , S.కోట మరియు పరిసర ప్రాంతాలు వైపు నుంచీ వచ్చే వాహనాలు కలెక్టర్ ఆఫీస్ నుండి గూడ్స్ షెడ్,సీఎంఆర్ జంక్షన్ మీదుగాసీఎంఆర్ షాపింగ్ మాల్ కి వ్యతిరేకంగా ఉన్న స్థలంలో పార్క్ చేయాలని సూచించారు..దాంతో పాటు పీజీ స్టార్ హాస్పటల్ ప్రక్కన గల ఖాలీ స్తలం లోనూ ఎస్బీఐ జంక్షన్ నుండి రామానాయుడు రోడ్డు మీదుగా ఎలక్ట్రికల్ సబ్ స్టేషన్ వద్ద గల పార్కింగ్ స్థలాలలో పార్క్ చేయాలన్నారు.ఇక ఏడవ తేదీ ఉదయం నుంచీ ఎనిమిది వ తేదీ రాత్రి పదిగంటల వరకుఈ దిగువన నిర్దేశించిన ప్రాంతాలలో వాహనాల రాకపోకలు నిషేధమని ఎస్పీ పేర్కొన్నారు.

1.బాలాజీ జంక్షన్ నుండి సింహాచలం మెడ జంక్షన్ వరకు.
2.సింహాచలం మెడ జంక్షన్ వైపు నుండి కోట వరకు .
3.బాలాజీ జంక్షన్ నుండి గంట స్థంబం వరకు .
4ఎం.ఆర్ కాలేజీ జంక్షన్ నుండి గురజాడ సర్కిల్ వరకు.
5.కన్యకా పరమేశ్వరి గుడివైపు నుండి గంటస్తంబం వరకు.
6.టాక్సీ స్టాండ్ వైపు నుండి గంట స్తంబం వరకు.
7.సామ్రాట్ లాడ్జీ జంక్షన్ నుండి శివాలయం మీదుగా ఎం.జీ రోడ్డు వరకు.
8.కమ్మవీది జంక్షన్ జంక్షన్ మూడు లాంతర్లు జంక్షన్ వరకు .
9.గుమ్చి జంక్షన్ నుండి కోట జంక్షన్ వైపుకు అన్ని వాహనాలు రాకపోకలు నిషేదించడమైనది.

ఈ నిషేదించ బడిన స్థలాలు లో ప్రజలు తమ వాహనాలు పార్కింగ్ చేసిన పక్షంలో ట్రాఫిక్ పోలీసులు వాహనాలను స్వాధీనం చేసుకోవడంతో పాటు జరీమానా కూడా విధిస్తారని ఎస్పీ దామోదర్ హెచ్చరించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

🔔 Subscribe for Latest Articles
Share: FacebookX/TwitterTelegramWhatsAppLinkedInReddit