Native Async

టైమ్‌ అంటే టైమే అంటోన్న నెదర్లాండ్‌ ఉద్యోగులు

Netherlands Work Culture Viral Video
Spread the love

ఆఫీసులు ఇచ్చిన సమయాన్ని సద్వినియోగం చేసుకోవడం… పని పూర్తికాగానే, సమయం అయిపోగానే లేచి వెళ్లిపోవడం. ఒక్క నిమిషం కూడా ఎక్కువ పని చేయవలసిన అవసరం లేదని అంటున్నారు నెదర్లాండ్‌ ఉద్యోగులు. అక్కడ పనిచేసే ఉద్యోగులు సమయానికి రావడం, తమకు ఇచ్చిన సమయంలో చేయవలసినంత పనిచేయడం, హార్డ్‌ వర్క్‌తో పాటు స్మార్ట్‌ వర్క్‌ కూడా చేయడం, సమయం పూర్తికాగానే వెళ్లిపోవడం. ఇది అక్కడ రెగ్యులర్‌గా జరిగే వ్యవహారం. అక్కడ ఏం జరుగుతుంది అనే విషయాలు మనవాళ్లు చెబితేనేగాని మనకు బోధపడదు.

పీఓకేలో భారీ నిరసనలు…గమనిస్తున్నామన్న కేంద్రం

ఇండియాకు చెందిన జ్యోతి సైని అనే చార్టెడ్‌ అకౌంటెంట్‌ నెదర్లాండ్‌లో ఓ కంపెనీలో పనిచేస్తున్నది. ఆమె ఇటీవలే ఓ వీడియోను సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేసింది. సాయంత్రం 5 గంటలకే ఆఫీసు ఖాళీ అవుతుందని, ఇప్పుడు సమయం 5.10 గంటలు అయిందని, ఖాళీ కుర్చీలు, సిస్టమ్స్‌ మినహా ఎవరూ ఆఫీసులో కనిపించలేదని తెలిపింది. హార్డ్‌ వర్క్‌, స్మార్ట్‌ వర్క్‌ ఏదైనా సరే బ్రెయిన్‌కు స్ట్రెస్‌ కలుగుతుంది. పనిగంటలు ముగిసిన తరువాత ఒక్కనిమిషం కూడా ఉద్యోగులు ఆఫీసులో ఉండరని తెలియజేసింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్‌ మీడియాలో ట్రెండ్‌ అవుతోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

🔔 Subscribe for Latest Articles
Share: FacebookX/TwitterTelegramWhatsAppLinkedInReddit