పెళ్ళిసందడి సినిమా చూసినప్పుడు అరేయ్ మన శ్రీకాంత్ కొడుకు భలే చేసాడే అనిపించింది కదా… మంచి హీరో మెటీరియల్ అని చాల మంది అనుకున్నారు. ఐతే ఆ సినిమా లో 2021 లో రిలీజ్ అయ్యింది… అప్పుడే నాలుగు ఏళ్ళు అవుతుంది కానీ అతని సెకండ్ సినిమా రాలేదు…
కానీ ఇప్పుడు టైం వచ్చింది… రోషన్ సెకండ్ సినిమా ‘ఛాంపియన్’ రిలీజ్ డేట్ ఇందాకే ప్రకటించారు… రిలీజ్ డేట్ పోస్టర్ లో రోషన్ స్టైలిష్ గా 1960s కాలం లో ఉన్నట్టు సూట్ లో భలే ఉన్నాడు… అలానే ఆ హాట్, ఫ్లైట్ అన్ని సూపర్ గా ఎలేవేషన్ ఇచ్చాయి…
ఈ సినిమా క్రిస్మస్ సందర్బంగా 25th డిసెంబర్ న రిలీజ్ అవ్వడానికి రెడీ గా ఉంది… ఈ స్పోర్ట్స్ డ్రామా లో అనశ్వర రాజన్ హీరోయిన్! సో గైస్, వైజయంతి మూవీస్ బ్యానర్ నుంచి మరో మంచి సినిమా రాబోతోంది…