Native Async

మృత్యుశకటాలుగా మారుతున్న బాణసంచా కేంద్రాలు

Firecracker Units Turning into Death Traps Massive Explosion in Konaseema Kills Seven
Spread the love

డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్‌ కోనసీమ జిల్లాలోని రాయవరం సమీపంలో ఉన్న ఓ బాణసంచా తయారీ పరిశ్రమలో భారీ పేలుడు సంభవించింది. ఈ నేపథ్యంలో జరిగిన అగ్నిప్రమాదంలో ఏడుగురు మృతి చెందారు. అగ్నిప్రమాదం జరిగిన ప్రదేశంలో ఆరుగులు మంటలకు ఆహుతికాగా, ఓ వ్యక్తిని ఆసుపత్రికి తరలిస్తుండగా మరణించాడు. ఈ ఘటనలో మరికొంతమందికి గాయాలయ్యాయి. అయితే, ఈ ప్రమాదంలో గాయపడిన వారిలో కొంతమంది పరిస్థితి సీరియస్‌గా ఉండటంతో మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంటుందని అధికారులు చెబుతున్నారు. కాగా, ఈ అగ్నిప్రమాదానికి కారణం ఏంటన్నది తెలియాల్సి ఉంది.

భారత్‌తో యూకే సరికొత్త మైత్రి

ఈ ప్రమాదంపై హోంశాఖ మంత్రి అనిత స్పందించారు. ప్రమాదంలో మృతిచెందిన కుటుంబాలకు సానుభూతి తెలియజేశారు. ఆయా కుటుంబాలకు అండగా ఉంటామని హామీ ఇచ్చారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యసౌకర్యం అందించాలని ఆదేశించారు. ఇకపోతే, ఈ ప్రమాదంపై అటు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు కూడా వాకబు చేశారు. ప్రమాదానికి కారణాలు, ప్రస్తుత పరిస్థితి, సహాయక చర్యలు, వైద్యసాయంపై అధికారుల నుంచి వివరాలను అడగితెలుసుకున్నారు. అధికారులు స్వయంగా సంఘటన స్థలానికి వెళ్లి సహాయక చర్యల్లో పాల్గొనాలని ఆదేశించారు.

గ్రామాల్లో ఏర్పాటు చేసిన బాణసంచా కేంద్రాలు మృత్యుశకటాలుగా మారుతున్నాయి. ప్రమాదాలు జరగకుండా తీసుకోవలసిన జాగ్రత్తలను ఆయా కేంద్రాలు పాటించడం లేదు. ప్రమాదం జరిగినపుడు హడావుడి చేసే యాజమాన్యం ఆ తరువాత సైలెంట్‌ అవుతున్నది. భవిష్యత్తులో ఇలాంటి పేలుళ్లు జరగకుండా చూసేలా చర్యలు తీసుకోవాలని బాధిత కుటుంబాలు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాయి. పొట్టకూటికోసం పనిచేస్తున్న రోజువారి కూలీలే ఇటువంటి ప్రమాదాలకు లోనవుతున్నారు. రెక్కల కష్టంతో పోషించే చేతులు లేకపోవడం బాధిత కుటుంబాలను రోడ్డున పడేస్తున్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *