విజయ్ దేవరకొండ తో చేసిన ‘Liger’ సినిమా ప్లాప్ అయిన తరువాత, పూరి జగన్నాధ్ రామ్ తో చేసిన ‘డబుల్ ఇస్మార్ట్’ కూడా పెద్ద ప్లాప్ అయ్యింది. ఇక పూరి పని అయిపోయిందని, నిర్మాత గా కూడా బాగా లాస్ అయ్యాడని అన్నారు…
కానీ అక్కడ ఉంది పూరి జగన్నాధ్… సో, మల్లి కం బ్యాక్ స్ట్రాంగ్ గా ఇస్తున్నాడు. ఈసారి తమిళ్ హీరో విజయ్ సేతుపతి తో సినిమా చేస్తున్నాడు… ఈ సినిమా లో టబు కీలక రోల్ చేస్తుండగా, దునియా విజయ్ ఇంకా సంయుక్త లు విలన్ ఇంకా హీరోయిన్ రొలెస్ చేస్తున్నారు.
సినిమా షూటింగ్ స్టార్ట్ చేసినప్పటి నుంచే నిర్మాతలు ప్రతి అప్డేట్ ని సోషల్ మీడియా లో షేర్ చేస్తున్నారు.
సో, మరి లేటెస్ట్ అప్డేట్ ఏంటో తెలుసా???
పూరి సేతుపతి సినిమా మ్యూజిక్ డైరెక్టర్ ఎవరో తెలుసా???
ఇంకెవరు యంగ్ మ్యూజిక్ డైరెక్టర్ హర్షవర్ధన్ రామేశ్వర్…
ఇదే అప్డేట్ ని సోషల్ మీడియా ద్వారా పంచుకున్నారు పూరి, ఛార్మి… ఆ పోస్ట్ కి మ్యూజిక్ డైరెక్టర్ హర్షవర్ధన్ రిప్లై ఇస్తూ, తన సంతోషాన్ని వ్యక్తం చేసారు…
పూరి-సేతుపతి సినిమాని పూరి జగన్నాధ్, Charmee తో పాటు JB Narayana Rao Kondrolla ప్రొడ్యూస్ చేస్తున్నారు…