కొద్ది రోజుల క్రితం కర్ణాటక రాష్ట్ర కాలుష్య నియంత్రణ బోర్డ్ (KSPCB) ఇచ్చిన ఆదేశాల మేరకు బిగ్ బాస్ కన్నడ హౌస్ ని సీజ్ చేశారు. అయితే ఆ నిర్ణయం తీసుకున్న రెండు రోజుల్లోనే, కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డి.కె. శివకుమార్ స్వయంగా ముందుకు వచ్చి, ఆ సీజ్ ఆర్డర్ ని ఎత్తివేశారు.
శివకుమార్ తన X (ట్విట్టర్) అకౌంట్ ద్వారా — “బిగ్ బాస్ కన్నడ షూట్ జరుగుతున్న బిడది లోని జోలీవుడ్ ప్రాంగణంపై ఉన్న సీజ్ ఆర్డర్ ను ఎత్తివేయాలని బెంగళూరు సౌత్ జిల్లా డిప్యూటీ కమిషనర్‌కి ఆదేశించాను,” అని. ఆయన మరీ ముఖ్యంగా అన్నారు — “పర్యావరణ పరిరక్షణ మా మొదటి ప్రాధాన్యతే అయినప్పటికీ, స్టూడియోకు తగిన సమయం ఇవ్వబడుతుంది. వారు KSPCB నిబంధనల ప్రకారం తగు మార్పులు చేయాలి. అదే సమయంలో, నేను కన్నడ ఎంటర్టైన్‌మెంట్ ఇండస్ట్రీకి పూర్తిగా మద్దతుగా ఉంటాను,” అని పేర్కొన్నారు.
అయితే, ఉప ముఖ్యమంత్రి తీసుకున్న ఈ నిర్ణయంపై కర్ణాటక ప్రజల నుంచి మిశ్రమ స్పందన వచ్చింది. కొంతమంది నెటిజన్లు ఆయన నిర్ణయంపై ప్రశ్నలు లేవనెత్తారు — “పర్యావరణ సమస్యల కంటే రియాలిటీ షో కి ప్రాధాన్యం ఎందుకు?” అని.
ఇదిలా ఉండగా, బిగ్ బాస్ కన్నడ హోస్ట్, సాండల్‌వుడ్ స్టార్ సుదీప్ తన కృతజ్ఞతలను వ్యక్తం చేశాడు. “మన షోకు ఎలాంటి సంబంధం లేని సమస్యల వలన హౌస్ సీజ్ చేయబడింది. కానీ ఉప ముఖ్యమంత్రి గారు వేగంగా స్పందించి, నిజమైన పరిస్థితిని అర్థం చేసుకుని సహాయం చేశారు,” అని సుదీప్ తన పోస్ట్ లో పేర్కొన్నారు.
అలాగే, ఆయన నల్పడ్ చేసిన ప్రయత్నాలను కూడా ప్రశంసిస్తూ, బిగ్ బాస్ కన్నడ సీజన్ 12 ఎటువంటి అంతరాయం లేకుండా కొనసాగుతుందని స్పష్టం చేశాడు. తన అభిమానులకు ధైర్యం చెప్పేలా చివరగా ఇలా రాశాడు — “#BBK12 is here to stay🔥”
మొత్తానికి, డీకే శివకుమార్ తీసుకున్న ఈ నిర్ణయం కన్నడ టెలివిజన్ ఇండస్ట్రీలో పెద్ద ఊపిరి పోసింది.