పాకిస్తాన్ ఎయిర్‌ఫోర్స్ గురువారం అర్థరాత్రి సమయంలో ఆఫ్ఘనిస్తాన్ రాజధాని కాబూల్, పక్తికా ప్రావిన్స్‌లో వైమానిక దాడులు చేసింది. తహ్రీక్ ఇ తాలిబన్ పాకిస్తాన్ ఉగ్రవాదులను ఏరివేయడమే లక్ష్యంగా ఈ దాడులు చేసినట్టు తెలియజేసింది. పాకిస్తాన్ భూభాగంలో జరిగిన ఉగ్రదాడులకు ప్రతీకారంగా ఈ దాడులు చేసినట్టుగా పాకిస్తాన్ ఆర్మీ విభాగం తెలియజేసింది. టెర్రరిజాన్ని అంతం చేయడమే లక్ష్యంగా దాడులు చేసినట్టుగా వెల్లడించింది.
పాక్ నిఘా వ్యవస్థ అందించిన సమాచారం ప్రకారమే ఈ దాడులు చేసినట్టుగా తెలుస్తోంది. అయితే ఈ దాడులు తెహ్రీక్ ఇ తాలిబన్ పాకిస్తాన్ టీటీపీ ప్రధాన నేత నూర్ వలి మేసుడ్ లక్ష్యంగా సాగాయి. ఈ దాడులు ఆయన మరణించాడని పాక్ ప్రకటించింది. కానీ, దాడుల తరువాత నూర్‌వలి స్వయంగా ఓ వీడియోను విడుదల చేశాడు. తాను సురక్షితంగా ఉన్ననని, తాను ఆఫ్ఘనిస్తాన్‌లో లేనని, పాకిస్తాన్‌లోనే ఉన్నట్టుగా తెలియజేశాడు. దీంతో నూర్‌వలి మరణంపై పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. టీటీపీ ప్రధాన నేత పాక్‌లో ఉంటే ఆఫ్ఘన్ భూభాగంలో ఆయనే లక్ష్యంగా ఎలా దాడులు చేశారనే అనుమానాలు కలుగుతున్నాయి. పాక్ నిఘావ్యవస్థ డొల్లతనం మరోసారి బయటపడింది. అసలు ఉగ్రవాదుల ప్రధాన నేతలు పాకిస్తాన్లో ఉన్నారా లేక ఆఫ్ఘనిస్తాన్‌లో ఉన్నారా అని తేల్చుకోకుండా దాడులు చేయడం వలన ఉపయోగం ఏంటని అంతర్జాతీయ నిపుణులు అంటున్నారు.
ప్రపంచ మానసిక ఆరోగ్య దినోత్సవం – లగ్జరీ కాదు ఇది మనిషి హక్కు
ఇక పాక్ చేసిన దాడులును ఆఫ్ఘాన్ ప్రభుత్వ ప్రతినిధులు తీవ్రంగా ఖండించారు. ఈ దాడులతో ఆఫ్ఘాన్ సార్వభౌమాదికారాన్ని ఉల్లంఘించిందని, రెండు దేశాల మధ్య ఉన్న ఒప్పందాలను విస్మరించిందని అన్నారు. పాక్ దాడుల వలన ఆఫ్ఘాన్ వైపు నుంచి పెద్దగా నష్టం జరగలేదని తెలియజేశారు. ఒప్పందాలను ఉల్లంఘించి దాడులు చేసిన పాక్‌పై ప్రతీకారం తీర్చుకుంటామని ఆఫ్ఘాన్ ప్రతినిధులు చెబుతున్నారు. ఇక పాకిస్తాన్ రక్షణశాఖ ఈరోజు మధ్యాహ్నం ప్రెస్మీట్లో కీలక వివరాలను వెల్లడించనున్నట్టు ప్రకటించింది. తాము ఖచ్చితమైన లక్ష్యాలతోనే దాడులు చేసినట్టుగా రక్షణశాఖ చెబుతోంది.
ఇదిలా ఉంటే ఆఫ్ఘాన్ విదేశాంగ శాఖ మంత్రి భారత్‌లో పర్యటిస్తున్న సమయంలో ఈ దాడులు చేయడం పలు అనుమానాలకు తావునిస్తోంది. భారత్‌తో ఆఫ్ఘనిస్తాన్ మైత్రి కుదిరితే దాని వలన పాకిస్తాన్‌కు ఇబ్బంది తలెత్తే అవకాశం ఉంది. ఇప్పటికే అటు బలూచ్, ఇటు పీవోకేలోనూ పాక్‌కు వ్యతిరేకంగా నిరసనలు, దాడులు జరుగుతున్నాయి. ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్ కూడా తమకు వ్యతిరేకంగా మారితే పాక్ మనుగడకు ముప్పు వాటిల్లే అవకాశం ఉంటుంది. ఈ నేపథ్యంలోనే ఆఫ్ఘన్‌ను తమ చేతుల్లోనే ఉంచుకోవడానికి పాక్ ప్రయత్నిస్తోంది. ఈ నేపథ్యంలోనే పాక్ దాడులకు పాల్పడి ఉంటుందని నిపుణులు అంచనా వేస్తున్నారు.