Native Async

అల్లు అర్జున్ అట్లీ సినిమా గురించి ఆసక్తికరమైన విషయాలు…

Allu Arjun And Atlee Team Up For A Futuristic Sci-Fi Spectacle – “Something Never Seen Before” Promises The Director!
Spread the love

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇప్పుడు బ్లాక్‌బస్టర్ డైరెక్టర్ అట్లీ తో కలిసి ఒక భారీ futuristic sci-fi డ్రామా చేస్తున్నారు అన్న సంగతి తెలిసిందే. ఐతే ఒక లేటెస్ట్ ఇంటర్వ్యూ లో, “ఇండియన్ సినిమాల్లో ఇంతవరకు తీయని సినిమా ఇది” అంటూ అట్లీ చెప్పిన మాటలతో అభిమానుల్లో జోష్ రెట్టింపు అయింది!

టాలీవుడ్‌ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ – మాస్ డైరెక్టర్ అట్లీ కుమార్ కాంబినేషన్‌ అనగానే ఫ్యాన్స్‌లో ఎలాంటి హడావుడో అర్థం చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ ఇద్దరూ కలిసి చేయబోయే ప్రాజెక్ట్‌ గురించి వినిపిస్తున్న ప్రతి వార్తా, అభిమానుల్లో కొత్త ఊపు తీసుకొస్తోంది.

ఈ సినిమా గురించి పెద్దగా వివరాలు బయటకు రాకపోయినా, ఇది ఒక ఫ్యూచరిస్టిక్‌ సైంటిఫిక్ డ్రామా అని సమాచారం. యాక్షన్‌, ఎమోషన్‌, విజువల్ గ్రాండ్యూర్‌ — ఇవన్నీ కలిపిన కొత్త ప్రపంచాన్ని చూపించబోతున్నాడట అట్లీ.

తాజా ఇంటర్వ్యూ లో అట్లీ మాట్లాడుతూ, “ఇది భారతీయ సినిమా లో ఎప్పుడూ తీయని కథ. ప్రేక్షకులు ఇంతవరకు చూడని విజువల్స్‌, కొత్త అనుభూతి ఇవ్వబోతున్నాం. ఈ సినిమా ప్రతి ఫ్రేమ్‌లో ఫ్రెష్ గా ఉంటుంది,” అన్నారు.

ఇంకా మాట్లాడుతూ — “ఇలాంటి సినిమాకు ఒకే బైబిల్ ఉండదు. చాలా పద్ధతులు కలిపి కొత్త దారులు వేయాలి. హాలీవుడ్ టెక్నీషియన్లు కూడా మా జట్టులో చేరారు. వాళ్లకూ ఇది చాలెంజింగ్‌గా ఉంది. కానీ, మేము ప్రతీ రోజు ఏదో కొత్తగా నేర్చుకుంటున్నాం. అన్నీ సరిగా సెట్ అవుతున్నాయి,” అని చెప్పారు.

ఈ ప్రాజెక్ట్‌ గురించి రిస్క్‌ ఉందా అని అడిగితే అట్లీ నవ్వుతూ, “ప్రేక్షకులే నన్ను ముందుకు నడిపిస్తారు. వాళ్లే నన్ను రాజా రాణి, తెరి, మెర్సల్, బిగిల్, జవాన్ లాంటి సినిమాలు చేయడానికి ప్రేరేపించారు. ఇది రిస్క్‌ కాదు, ఇది ఎంజాయ్‌మెంట్‌. మేము కొత్తగా చేస్తున్నాం — అది చూసిన వాళ్లందరికీ ఆడిక్టివ్‌ అవుతుంది,” అని అన్నారు.

ఇంతవరకు అట్లీ, విజయ్ ఇంకా షారుఖ్ ఖాన్ వంటి సూపర్‌స్టార్లతో పనిచేశారు. కానీ ఇప్పుడు ఆయన అల్లు అర్జున్ తో పనిచేస్తుండటం ఆయన కెరీర్‌లో కొత్త మలుపు అవుతుంది. Bunny మాస్‌, స్టైల్‌, ఎమోషన్‌కి అట్లీ టేక్‌ కలిస్తే — అది తప్పక కొత్త దారిని చూపించే సినిమా అవుతుందనే నమ్మకం ఉంది.

ఈ భారీ ప్రాజెక్ట్‌ను Sun Pictures నిర్మిస్తోంది. సంగీతాన్ని సాయి అభ్యంకర్ అందిస్తున్నారు. అట్లీ మాటల్లో చెప్పాలంటే — “ఇంకొన్ని నెలల్లో ఈ సినిమా నుంచి ఒక స్పెషల్ గ్లింప్స్ చూపిస్తాం. ఇది మేము ఎప్పుడూ చేయని ప్రయాణం. కానీ, ప్రతి ఫ్రేమ్ ప్రేక్షకులను కొత్త ప్రపంచంలోకి తీసుకెళ్తుంది.”

అల్లు అర్జున్ – అట్లీ కాంబో అంటేనే మాస్‌, మ్యాజిక్‌, మ్యాగ్నిటిజం. ఇప్పుడు ఈ ఇద్దరూ కలిసి futuristic worldలో ఒక అద్భుతం సృష్టించబోతున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *