Native Async

తిరుమలలో వివాహానికి మార్గాలు ఇవే

How to Get Married in Tirumala – Complete Guide to TTD Marriage Procedures and Booking Options
Spread the love

తిరుమల బాలాజీ సన్నిధిలో వివాహం చేసుకుంటే దాంపత్య జీవితం సుఖసంతోషాలతో ఉంటుందని, తిరుమలలో వివాహం చేసుకొని ఆ శ్రీవేంకటేశ్వరుడిని దర్శనం చేసుకుంటే మంచి పిల్లలు కలుగుతారని నమ్మకం. ఈ నమ్మకంతోనే తిరుమలలో వివాహం చేసుకోవడానికి కులమత బేధాలు లేకుండా, ధనికపేదభావం లేకుండా ప్రయత్నిస్తుంటారు. అయితే, తిరుమలలో వివాహం చేసుకోవడానికి మూడు రకాలైన మార్గాలు ఉన్నాయి.

ఇందులో మొదటిటి కళ్యాణ వేదిక. టీటీడీ వెబ్‌సైట్‌లో కళ్యాణ వేదిక ట్యాబ్‌లోకి వెళ్లి అక్కడ డీటెయిల్స్‌ ఇవ్వాలి. అయితే, ఇది సామూహిక వివాహం. ఒకేచోట ఒకేసారి వందలాది జంటలకు వివాహం జరిపిస్తారు. ఇదంతా టీటీడీ ఉచితంగా చేస్తుంది. ఇక్కడ వివాహం చేసుకున్న జంటకు దర్శనం ఉచితంగా త్వరతిగతిన జరుగుతుంది. ఇకపోతే రెండోది టీటీడీ మండపం బుక్‌ చేసుకోవడం. వివాహం జరిపించుకోవడానికి అవసరమైన, టీటీడీ పొందుపరిచిన దృవపత్రాలను చెక్‌ చేసుకొని మూడు నెలల ముందుగానే సీఆర్‌ఓ వద్ద మండపాన్ని బుక్‌ చేసుకోవాలి. అయితే, ముందుగా ఎవరైతే బుక్‌ చేసుకుంటారో వారికే అవకాశం దొరుకుతుంది. ఇది రెండో పద్దతి. ఇక మూడో పద్దతి ప్రైవేట్‌ లేదా కమ్యునిటీ హాల్స్‌ను బుక్‌ చేసుకోవడం. తిరుమలలో ప్రతి సంప్రదాయానికి సంబంధించి సత్రాలు ఉన్నాయి. ఈ సత్రాల్లోనే మండపాలు, హాల్లు ఉంటాయి. వ్యక్తిగతంగా సంప్రదించి తేదీలు ఖరారు చేసుకోవాలి.

ఆఫ్ఘన్‌ పాక్‌ సరిహద్దుల్లో తీవ్ర ఉద్రిక్తత…

టీటీడీ మండపం బుక్‌ చేసుకుంటే తిరుమల తిరుపతి దేవస్థానం వారు వసతి ఏర్పాటు చేస్తారు. మూడో పద్దతితో బుక్‌ చేసుకుంటే సత్రాల్లో వసతి బుక్ చేసుకోవచ్చు. కానీ సామూహిక వివాహాలకు టీటీడీ వసతి కల్పించదు. భక్తులే స్వయంగా కాటేజ్‌ బుకింగ్‌ కౌంటర్లలో కాటేజీలను బుక్‌ చేసుకోవాలి. వివాహాలు, ఉపనయనాలకు రూ. 300 రసీదు తీసుకోవాలి. వివాహం, వివాహానికి సంబంధించిన మేళం ఉచితంగానే అందిస్తారు. ఇక తిరుమలలోనే సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకోవడానికి రూ. 300 టోకెన్‌ తీసుకోవాలి. ఇతర పూజల కోసం రూ. 100 టికెట్‌ తీసుకోవలసి ఉంటుంది. వివాహాలు, వ్రతాలకు సంబంధించి టోల్ ఫ్రీ 1800 425 4141, సూచనల ఫిర్యాదుల  కోసం Ph నం. 0877-226343330ను సంప్రదించవచ్చు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

🔔 Subscribe for Latest Articles
Share: FacebookX/TwitterTelegramWhatsAppLinkedInReddit