Native Async

రామ్ పోతినేని ‘ఆంధ్ర కింగ్ తాలూకా’ టీజర్…

Ram Pothineni’s Andhra King Taluka Teaser Unveiled – A Unique Fan-Based Biopic With Upendra And Bhagyashri Bhorse
Spread the love

ఫుల్ ఎనర్జీతో, యువతలో ప్రత్యేకమైన క్రేజ్ సంపాదించుకున్న హీరో రామ్ పొతినేని, ఇప్పుడు తన కెరీర్‌లో సాలిడ్ కంబ్యాక్ ఇవ్వడానికి రెడీ అయ్యాడు. మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి దర్శకుడు మహేష్ బాబు దర్శకత్వంలో రూపొందుతున్న తాజా చిత్రం ‘అంధ్ర కింగ్ తాలూకా’ లో రామ్ ఓ విభిన్న పాత్రలో కనిపించనున్నాడు. ఇందులో భాగ్యశ్రీ భోర్సే హీరోయిన్‌గా నటిస్తుండగా, కన్నడ స్టార్ హీరో ఉపేంద్ర కీలకమైన పాత్రలో మెరిసారు.

ఈ సినిమా టీజర్ నేడు విడుదల కాగా, అందులో రామ్ ‘అంధ్ర కింగ్’ ఉపేంద్ర అనే స్టార్ హీరోకు డై హార్డ్ ఫ్యాన్‌గా చూపించారు. తన ప్రియమైన హీరో కోసం ఏ స్థాయికైనా వెళ్లే ఓ అభిమానిగా రామ్ యాక్టింగ్ అద్భుతంగా కనపడింది. తర్వాత ఆయన లవ్ ఇంటరెస్ట్‌గా భాగ్యశ్రీ భోర్సే ఎంట్రీ ఇచ్చి, రొమాంటిక్ ట్రాక్‌తో టీజర్‌కి మరింత ఫ్రెష్ టచ్ ఇచ్చింది.

తర్వాత మన తెలుగు రాష్ట్రాల్లో తరచుగా కనిపించే ఫ్యాన్ వార్స్ ను ఈ టీజర్ రియలిస్టిక్‌గా చూపించింది. సాధారణ ఫ్యాన్ జీవితంలోని ఉత్కంఠ, ఆరాధన, ఆ ప్రేమ వల్ల వచ్చే మార్పులు — చివర్లో రామ్ చెప్పిన డైలాగ్ —
“ఫ్యాన్ ఫ్యాన్ అని నువ్వు గుడ్డలు చింపేసుకోడమే కానీ నువ్వు ఒక్కడివీ ఉన్నావు అన్నారు ఆ హీరో కి కూడా తెలీదు… ఎం బతుకులు రా మీవి…”, మన ఫ్యాన్ కల్చర్ లోని నిజ జీవిత వాస్తవాలను ప్రతిబింబిస్తూ, కథలో టర్నింగ్ పాయింట్‌ను సూచించింది.

ఈ టీజర్ ద్వారా రామ్ మరోసారి యూనిక్ సబ్జెక్ట్‌ని ఎంచుకున్నాడని స్పష్టంగా తెలుస్తోంది. కమర్షియల్ టచ్‌లోనూ, రియలిస్టిక్ ఎమోషన్‌తోనూ తెరకెక్కుతున్న ఈ చిత్రం రామ్ కెరీర్‌లో కొత్త మలుపు అవుతుందని ఫ్యాన్స్ భావిస్తున్నారు.
ఈ సినిమాలో రావు రమేశ్, మురళీ శర్మ, సత్య, రాహుల్ రామకృష్ణ, వీవీ గణేష్ వంటి నటులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు.

మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా నవంబర్ 28న గ్రాండ్‌గా రిలీజ్ కానుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

🔔 Subscribe for Latest Articles
Share: FacebookX/TwitterTelegramWhatsAppLinkedInReddit