80sలో, 90sలో, అలాగే 2000లో ఫ్యాన్ సంఘాలు చాలా చురుకుగా ఉండేవి. కానీ కాలం మారిపోవడంతో ఇప్పుడు ఫ్యాన్స్ అసోసియేషన్స్ ఆల్మోస్ట్ లేవు. కానీ ఒక మెగాస్టార్ కానీ, నందమూరి బాలకృష్ణ కానీ, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కానీ ఇంకా ఇలా పెద్ద హీరోస్ కి ఫ్యాన్ అసోసియేషన్స్ ఉన్నాయ్… ఇప్పుడు ఆ జాబితాలోకి అధికారికంగా చేరింది మన ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఫ్యాన్స్ అసోసియేషన్…
ఇప్పటి వరకు అల్లు అర్జున్ అభిమానులు మెగా ఫ్యాన్స్ అసోసియేషన్‌లో భాగంగా ఉండేవారు. కానీ ఇప్పుడు ఆయన స్వంతంగా తన పేరుతో ప్రత్యేక అభిమాన సంఘాన్ని ఏర్పాటు చేశారు. ఈ అసోసియేషన్ అధికారికంగా రిజిస్టర్ చేయబడింది, అలాగే ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల కోసం ప్రత్యేక కమిటీ సభ్యులను కూడా ప్రకటించారు.
ఈ విషయాన్ని ట్విట్టర్ లో కూడా పోస్ట్ చేసారు ఫాన్స్ అసోసియేషన్ వాళ్ళు!
“మేము అధికారికంగా Allu Arjun Fans Association ను ప్రారంభిస్తున్నందుకు ఎంతో సంతోషంగా ఉంది! ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాలకు చెందిన ఎన్నికైన కమిటీ సభ్యులను గర్వంగా పరిచయం చేస్తున్నాం. అందరికీ హృదయపూర్వక అభినందనలు, మీ ప్రయాణం ఐక్యత, సక్సెస్ మరియు ప్యాషన్‌తో నిండిపోవాలని కోరుకుంటున్నాం.” అంటూ పోస్ట్ చేసి నెటిజన్స్ ని కూడా ఖుష్ చేసారు…
ఈ తరానికి చెందిన స్టార్‌లలో ఇంత పెద్ద స్థాయిలో అభిమాన సంఘాన్ని స్వయంగా ప్రారంభించినది ఇదే మొదటి సారి. ఇకపై ఈ అసోసియేషన్ ఫ్యాన్స్ సంక్షేమం కోసం, వివిధ కార్యక్రమాల ప్రణాళిక కోసం, మరియు అల్లుఅర్జున్ ఫ్యాండమ్‌ను మరింత ఉన్నత స్థాయికి తీసుకెళ్లేందుకు కృషి చేయనుంది.
ఇక గత కొన్నేళ్లుగా సోషల్ మీడియాలో మెగా అభిమానులు, అల్లుఅర్జున్ అభిమానుల మధ్య చర్చలు, విభేదాలు చోటు చేసుకున్నాయి. అలాంటి సమయంలో, ఇప్పుడు బన్నీ ఫ్యాన్స్ తమ సొంత పేరుతో, అధికారికంగా రిజిస్టర్ అయిన అభిమాన సంఘం ఏర్పరచుకోవడం గర్వకారణం.
ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఐకాన్ స్టార్ అభిమానుల్లో ఇది ఏవిధమైన మార్పు తీసుకురాబోతోందో చూడాలి!ఐకాన్ స్టార్ అల్లుఅర్జున్ అధికారికంగా ప్రారంభించిన ‘అల్లుఅర్జున్ ఫ్యాన్స్ అసోసియేషన్’ – బన్నీ అభిమానుల కోసం కొత్త యుగం ప్రారంభం! 🌟🔥