ప్రభాస్ బర్త్డే అని అడిగితే, ఫాన్స్ అందరు టక్కున అక్టోబర్ 23 అని చెప్తారు… ఇంకా జస్ట్ పది రోజులు కూడా లేవు అందుకే సెలెబ్రేషన్స్ షురూ అయ్యాయి కూడా… ఐతే, ప్రస్తుతాని ప్రభాస్ మూడు సినిమాల గురించి అందరు వెయిటింగ్…
అందుకే ఆయన సినిమాలపై అప్‌డేట్స్ కోసం ఫ్యాన్స్ ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నారు. గతంలో, ప్రభాస్ టీం రిలీజ్‌కు దగ్గరగా ఉన్న సినిమాలపై మాత్రమే ఫోకస్ పెట్టేది. కానీ ఈసారి మాత్రం పరిస్థితి పూర్తిగా భిన్నంగా ఉంది.

ప్రస్తుతం ప్రభాస్ నటిస్తున్న ‘ది రాజా సాబ్’ సినిమా షూటింగ్ ఎండింగ్ లో ఉంది. గ్రీస్‌లో పాటల చిత్రీకరణ కొనసాగుతోంది. జనవరి 9న సంక్రాంతికి థియేటర్లలోకి రానున్న ఈ సినిమాకు మూడు నెలల లోపు మొత్తం షూట్ పూర్తవనుంది. ఈ సందర్భంగా, ప్రభాస్ పుట్టినరోజునే సినిమా నుండి ఫస్ట్ సాంగ్ విడుదల చేయాలని చిత్రబృందం ప్లాన్ చేస్తోంది. ఈ పాట ప్రభాస్ క్యారెక్టర్ ఇంట్రడక్షన్‌గా ఉంటుందని, అద్భుతమైన సెట్స్‌లో భారీ స్థాయిలో షూట్ చేసినట్లు తెలుస్తోంది.

ఇక మరోవైపు, హను రాఘవపూడి దర్శకత్వంలో మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ప్రభాస్ కొత్త ప్రాజెక్ట్ ‘ఫౌజీ’ కూడా లైన్ లో ఉంది. అంధాల రాక్షసి, సీతారామం వంటి క్లాసిక్ సినిమాలు తెరకెక్కించిన హను, ఇటీవల జరిగిన డూడ్ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో ప్రభాస్ పుట్టినరోజున ఫౌజీ టైటిల్ రివీల్ ఉంటుందని ధృవీకరించారు.

ఇంకా అభిమానులకు మూడో సర్‌ప్రైజ్ కూడా రెడీగా ఉంది. ప్రపంచవ్యాప్తంగా బ్లాక్‌బస్టర్‌గా నిలిచిన బాహుబలి సినిమాను ఒకే ఫార్మాట్‌లో మళ్లీ రీకట్ చేసి Baahubali: The Epic పేరుతో అక్టోబర్ 31న ఐమ్యాక్స్, డాల్బీ సినెమా, 4DX, DBox, EpiQ, ICE, PCX వంటి ప్రీమియం ఫార్మాట్లలో రిలీజ్ చేయబోతున్నారు. ఈ వెర్షన్ ట్రైలర్‌ను ప్రభాస్ బర్త్‌డే సమయానికే రిలీజ్ చేయాలనే ఐడియా లో ఉన్నారు.
అంటే ఈ ఏడాది ప్రభాస్ ఫ్యాన్స్‌కు ట్రిపుల్ ట్రీట్ ఖాయం – ది రాజా సాబ్ నుండి ఒక మ్యూజిక్ సాంగ్, ఫౌజీ టైటిల్ రివీల్, అలాగే బాహుబలి: ది ఎపిక్ ట్రైలర్! సూపర్ కదా…