బాహుబలి… ఈ సినిమా కి ఒక చరిత్ర ఉందనే చెప్పాలి! మొదట ఎక్కడ నుంచి స్టార్ట్ చేయాలి అంటే, అంతకు ముందు మంచి సినిమాలు లేవా అంటే ఉన్నాయ్! కానీ రాజమౌళి కూడా మగధీర, ఈగ తీసాడు గా అంటారు… కానీ బాహుబలి అలా కాదు, మొన్న వచ్చిన ‘లిటిల్ హార్ట్స్’ సినిమాలో సెకండ్ హీరో చెప్పినట్టు బాహుబలి ప్లాప్ అన్నారు మొదట చుసిన వాళ్ళు… కానీ ఆ సినిమా రేంజ్ ఏంటో మనకి తెలుసు… డైరెక్టర్, యాక్టర్స్, నిర్మాతల ఐదేళ్ల కష్టం సూపర్ హిట్ అయ్యింది… అలాగే ఎవరి నోట చుసిన “కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడు?” అనే ప్రశ్న… ఆమ్మో అనుకున్నాం కానీ సెకండ్ పార్ట్ ఇంకా పెద్ద హిట్ అయ్యింది…

ఇప్పుడు ఆ సినిమాలు రిలీజ్ అయ్యి 10 ఏళ్ళు అయిన సందర్బంగా మళ్ళి సరికొత్తగా ఆ సినిమా చూడడానికి సిద్ధం అయిపోండి. రెండు పార్ట్స్ కలిసి ఒకే సినిమాలా చేసి, విడుదల చేయబోతున్నారు ఈ నెల 31 న. అలాగే ఈ సినిమా కి సెన్సార్ వాళ్ళు కూడా యూ/ఏ సర్టిఫికెట్ ఇచ్చేసారు…

ఇంతకీ ఈ సినిమా రన్ టైం ఎంతో తెలుసా: మూడు గంటల 44 నిముషాలు! సో, పెద్ద గా అనుకున్నట్టు, పెద్ద సినిమా కాదు, అందుకే మళ్ళి ఈ GENZ కిడ్స్ కి అసలు మన బాహుబలి పవర్ ని మళ్ళి చూపిద్దాం! అలానే మనకి ఎందుకు ప్రభాస్, అనుష్క, రానా అంటే ఎంత ప్రేమో వాళ్ళకి చూపిద్దాం!