టైటిల్ చూస్తేనే మీకు తెలిసిపోయింది గా అసలు జటాధరా ట్రైలర్ ఎంతగా ఇంప్రెస్స్ చేసిందో అని… ఈ సినిమా అనౌన్స్ చేసినప్పటి నుంచి అంచనాలు పీక్స్ లో ఉన్నాయ్. ఇక టీజర్ లోనే సోనాక్షి సిన్హా ని ధన పిశాచి గా పరిచయం చేసి చంపేశారు.
ఇందాకే వెంకట్ కళ్యాణ్ – అభిషేక్ జైస్వాల్ దర్శకత్వంలో తెరకెక్కిన జటాధర సినిమా ట్రైలర్ ను సూపర్ స్టార్ మహేష్ బాబు రిలీజ్ చేశారు. విడుదల తేదీ దగ్గరపడుతున్న వేళ, ఈ ట్రైలర్ తో సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి.
ట్రైలర్ మొదలవ్వగానే ఒక ఆసక్తికరమైన నేపథ్యం చూపిస్తారు — శతాబ్దాల నాటి “పిశాచ బంధనం” అనే కృష్ణమంత్రం ద్వారా రక్షించబడుతున్న రహస్య నిధి గురించిన కథ. దెయ్యాలంటే నమ్మకం లేని హీరో ఆ రహస్యాన్ని ఛేదించడానికి బయలుదేరుతాడు. అయితే, లోభంతో ఉన్న ఒక వ్యక్తి ఆ నిధిని వెలికితీయడానికి ప్రయత్నిస్తాడు. అలా “ధన పిశాచిని” అనే భయంకరమైన ఆత్మ మేల్కోటుంది. తర్వాత హీరో తన శక్తిమేరకు ఆ దెయ్యాన్ని ఎదుర్కొనే యుద్ధమే ఈ కథ యొక్క ప్రధాన ఆకర్షణ.
ఈ సినిమాలో సుధీర్ బాబు ఓ గోస్ట్ హంటర్ పాత్రలో కనిపించనున్నాడు. ట్రైలర్ లో చివర్లో వచ్చే సన్నివేశం — రక్తం తాగే సీక్వెన్స్ — ప్రేక్షకులకు గూస్ బంప్స్ ఇచ్చేలా ఉంది. కొత్త లుక్ లో సుధీర్ బాబు చాలా రగ్గడ్‌గా, పవర్‌ఫుల్‌గా కనిపించాడు. సొనాక్షి సిన్హా విలన్ పాత్రలో కొత్త షేడ్స్ చూపించింది. ఆమె ఈ సినిమాకి హైలైట్… పిశాచి గా చంపేసింది… మొత్తం స్క్రీన్ అంత తనే ఉంటుంది అని చెప్పడం లో అతిశయోక్తిలేదు. ఇంకా అవసరాల శ్రీనివాస్, శిల్పా శిరోధ్కర్ కూడా కీలక పాత్రల్లో కనిపించారు.
ఈ ట్రైలర్ తో జటాధర సినిమాపై అంచనాలు కొత్త స్థాయికి చేరుకున్నాయి. మిస్టరీ, యాక్షన్, థ్రిల్లింగ్ హారర్ కలగలిపిన ఈ సినిమా, సుధీర్ కెరీర్ లో మరో మైలురాయిగా నిలుస్తుందనడంలో ఎటువంటి సందేహం లేదు.