అక్టోబర్ 18, 2025 న అమెరికా అంతటా “నో కింగ్స్ డే” పేరుతో చరిత్రలో నిలిచిపోయే స్థాయిలో నిరసనలు చోటు చేసుకున్నాయి. 2,700కిపైగా నగరాలు, పట్టణాలు, కాలేజీ క్యాంపస్‌లు, పబ్లిక్ స్క్వేర్‌లు, చర్చిల ముందు, ప్రభుత్వం కార్యాలయాల చుట్టూ కోట్లాది మంది ప్రజలు ఒకేసారి శాంతియుతంగా కూడి “అమెరికాకు రాజులు అవసరం లేదు – కన్‌స్టిట్యూషన్ చాలు” అంటూ తమ స్వరాన్ని వినిపించారు.
డొనాల్డ్ ట్రంప్ తన ఎన్నికల ప్రచారంలో పదేపదే వినిపిస్తున్న “నేనే చట్టం — నేనే దేశం” వంటి అధికార దుర్వినియోగ భావజాలానికి వ్యతిరేకంగా ఇది స్పష్టమైన ప్రజాస్వామ్య హెచ్చరికగా భావిస్తున్నారు. స్వతంత్ర విశ్లేషణ సంస్థల లెక్కల ప్రకారం 3 నుండి 5 మిలియన్ల మధ్య మంది ఈ నిరసనలకు హాజరయ్యారు. ఇది అమెరికా చరిత్రలో ఒకే రోజున జరిగిన అతిపెద్ద ప్రజాస్వామ్య ర్యాలీల్లో ఒకటిగా అధికారికంగా గుర్తింపు పొందింది.
ప్రత్యేకత ఏమిటంటే — దేశవ్యాప్తంగా ఒక్క అరెస్టు కూడా జరగలేదు. ఒక్క హింసాత్మక ఘటన కూడా నమోదు కాలేదు. పోలీసు విభాగాల స్పష్టమైన ధృవీకరణ ఇది. ఇది “ఆర్గనైజ్డ్ సివిల్ డిసిప్లిన్” కి ఐకాన్‌గా నిలిచే రోజు అని విశ్లేషకులు పేర్కొన్నారు.
“ఇది పార్టీ రాజకీయం కాదు, కన్‌స్టిట్యూషన్‌ను రక్షించే ప్రజల పిలుపు” అని డెమోక్రాటిక్ నాయకులు బర్నీ సాండర్స్, చక్ షూమర్, ఎలిజబెత్ వారెన్ తదితరులు తమ అధికారిక ప్రకటనల్లో ప్రశంసించారు.
అయితే, ట్రంప్ మద్దతుదారులు దీన్ని “డీప్ స్టేట్ ఆస్ట్రోటర్ఫ్ షో” అని అభివర్ణించినా, ఆ ఆరోపణలకు ఎలాంటి ఆధారాలు లేవని ఫ్యాక్ట్‌చేక్ సంస్థలు స్పష్టం చేశాయి.
నో కింగ్స్ డే విజయవంతం అయిన తర్వాత, ఇది కేవలం నిరసన కాదని.. అమెరికన్ ప్రజాస్వామ్యాన్ని కాపాడే అభివృద్ధి చెందిన మానసికత, సివిల్ పవర్, ప్రజాస్వామ్య గౌరవం కు ఓ ప్రతీకగా ప్రపంచం ముందుకు నిలిచిందని అంతర్జాతీయ మీడియా పేర్కొంది.