నవీన్ పొలిశెట్టి ఒక స్టార్ స్టార్ ఎంటర్‌టైనర్ అని మనకి తెలుసు కదా…కానీ accident వల్ల కొంచం గ్యాప్ వచ్చింది… కానీ మళ్ళి మనకి పండగ బొమ్మ ‘అనగనగ ఒక రాజు’ తో సిద్ధంగా ఉన్నాడు. ఈ దీపావళికి ఆయన ఫ్యాన్స్‌కి ఇచ్చిన గిఫ్ట్ మాత్రం అసలు ఫన్‌ఫుల్ ట్రీట్ అని చెప్పాలి. ‘అనగనగా ఒక రాజు’ మూవీ నుండి రిలీజ్ అయిన ‘ఫన్ బ్లాస్ట్ ప్రమో’ సోషల్ మీడియా అంతా హీట్ క్రియేట్ చేస్తోంది. నవీన్ తన టైమింగ్, హాస్యం, ఎనర్జీతో మరోసారి ప్రేక్షకుల మనసులు గెలుచుకున్నారు.
ఒక నిమిషం కంటే కొంచెం ఎక్కువ ఉండే ఈ ప్రమోలో నవీన్ పొలిశెట్టి స్పెషల్ ఎనర్జీ స్పష్టంగా కనిపిస్తోంది. ఫన్, ఫ్రెష్‌నెస్, ఫీల్‌గుడ్ హాస్యం — ఇవన్నీ ప్రోమో ని హిట్ చేసాయి.
ఈ సినిమాకు కొత్త దర్శకుడు మారి దర్శకత్వం వహిస్తుండగా, సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ ఇంకా ఫార్చూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్లపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మిస్తున్నారు. హీరోయిన్‌గా అందాల భామ మీనాక్షి చౌదరి నటించగా, ఈ సినిమా నుండి తొలి పాట త్వరలో రిలీజ్ కానుంది.