ప్రధాని నరేంద్రమోడి ప్రతీ ఏడాది దీపావళి పండుగను ఢిల్లీలోని తన కార్యాలయం లేదా ఇంట్లో కాకుండా దేశ సరిహద్దులను రక్షిస్తున్న సైనికుల మధ్య జరుపుకోవడం ఆనవాయితీగా వస్తోంది. ఇందులో భాగంగా ఈ ఏడాది ప్రధాని మన దేశానికి గర్వకారణంగా నిలిచిన స్వదేశీ విమాన వాహన నౌక ఐఎన్ఎస్ విక్రాంత్‌పై జరుపుకున్నారు. ఆత్మనిర్భర్ భారత్‌లో భాగంగా ఐఎన్ఎస్ విక్రాంత్‌ను భారత్ రూపొందించింది. ఈ నౌకలోని సైనికులతో, అధికారులతో కలిసి దీపావళిని జరుపుకున్నారు.
ఇక ఇందులో పనిచేస్తున్న ప్రతి ఒక్కరినీ ప్రధాని పలకరించి వారి బాగోగులు తెలుసుకున్నారు. ఐఎన్ఎస్ డెక్‌పై సైనికులతో కలిసి సరదాగా గడిపారు. ఇక సైనికులు స్వయంగా రాసిన దేశభక్తి కవితలు, ఉత్సాహభరితమైన పాటలతో వాతావరణం సందడిగా మారింది. సముద్రంలో కాపలాగా ఉన్నందువలనే ఈరోజు దేశ ప్రజలు ఇంట్లో సురక్షితంగా దీపావళిని జరుపుకుంటున్నారని తెలిపారు. భావోద్వేగంతో ప్రధాని మోదీ ప్రసంగించిన తీరు ప్రతి ఒక్కరినీ ఆకట్టుకుంది.
ఈ వెలుగుల పండుగను భూమిపై కాకుండా ఇలా సముద్రంపై జరుపుకోవడం భారత చరిత్రలో అరుదైన ఘట్టమని చెప్పాలి. సైనికులు డెక్‌పై దీపాలు వెలిగించి శుభాకాంక్షలు తెలియజేశారు.