Native Async

కార్తీకమాసం విశిష్టత…పాటించవలసిన నియమాలు ఇవే

Karthika Masam Significance & Rules to Follow Powerful Spiritual Benefits Explained
Spread the love

కార్తీకమాసం ప్రారంభమౌతుంది అంటే ప్రకృతి మొత్తం ఆధ్యాత్మిక శ్వాస తీసుకుంటున్నట్టుంటుంది. ఆశ్వయుజ బహుళ అమావాస్య పూర్తవ్వగానే పాడ్యమి తిథి ప్రారంభమౌతుంది. పాడ్యమి నుంచి అంటే అక్టోబర్‌ 22 బుధవారం నుంచి కార్తీకమాసం ప్రారంభం అవుతుంది. స్కంధపురాణం ప్రకారం ఈ మాసంలో దేవతలు భూమిపైకి వచ్చి మానవులు భక్తిశ్రద్ధలను పరిశీలిస్తారు. వారి భక్తికి మెచ్చి బహువిధాలైన వరాలను ప్రసాదిస్తారని పురాణాలు చెబుతున్నాయి. ఈ మాసంలో దీపాలు వెలిగించడం, తులసిచెట్టు దగ్గర దీపారాధన చేయడం అత్యంత ముఖ్యమైనది. దీపాలు వెలిగించడం అంటే అది కేవలం ఓ సంప్రదాయం మాత్రమే కాదు…జ్ఞానాన్ని అందించే విశ్వశక్తిని ఆహ్వానించడమే.

ఈ సమయంలో ప్రకృతి వాతావరణం కూడా శివతత్వానికి అనుకూలంగా ఉంటుంది. తెల్లవారుజామున వీచే గాలిలో ఓ మాధుర్యం కనిపిస్తుంది. ఆ సమయంలో స్నానం చేసి, గోమయంతో చేసిన దీపంలో నెయ్యివేసి వెలిగించాలి. దీపం నాలోని చీకట్లను తొలగించు అని భావపూర్వకంగా ప్రార్థించాలి. ఇలా ప్రార్థించినవారికి శాంతి నెలకొంటుందని శాస్త్రం చెబుతోంది.

దీపంలా మనిషి జీవితం ఎలా వెలగాలి…24 మంది గురువులు ఎవరు?

కార్తీకమాసంలో శివారాధన విషయంలో కొన్ని ముఖ్యమైన నియమాలను పాటించాలి.
కార్తీకమాసంలో ఉదయాన్నే స్నానం చేసి ఇంటిముందు దీపం వెలిగించాలి.
రాత్రి సమయంలో తులసి చెట్టువద్ద దీపం వెలిగించాలి.
గంగవెల్లరి పట్టు ధరించి గోమాతకు పశుగ్రాసం తినిపించాలి
ఈ మాసంలో నూనె, వెల్లుల్లి, మాంసాహారం, అబద్దం చెప్పడం, కోపం తెచ్చుకోవడం చేయకూడదు
శివాలయంలో రుద్రాభిషేకం చేయాలి.
వీలుకాకుంటే కనీసం ఓం నమఃశివాయ అని 11,21 లేదా 108 సార్లు జపించాలి.

కార్తీకమాసంలో ఆడంబరాలకంటే పరిశుద్ధమైన హృదయంతో దీపం వెలిగిస్తే చాలు. కార్తీకమాసం పూజల పండుగ కాదు…ఆత్మను వెలిగించే ఆత్మపరిశీలన సమయం మాత్రమే.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

🔔 Subscribe for Latest Articles
Share: FacebookX/TwitterTelegramWhatsAppLinkedInReddit