సంక్రాంతి తర్వాత తెలుగు సినిమా ఇండస్ట్రీలో మరో పెద్ద రీలీజ్ సీజన్‌గా అనబడేది ఏడాది చివరన వచ్చే క్రిస్మస్. హాలిడే సీజన్లో కాబట్టి అందరు మంచి సినిమాల కోసం థియేటర్లకు వస్తారు. అందుకే ఈ ఏడాది క్రిస్మస్ డేట్ కోసం పోటీ పడుతున్నారు.
డిసెంబర్ 25, 2025న ఐదు తెలుగు సినిమాలు థియేటర్లలో ఒకేసారి రాబోతున్నాయి. ఇది బాక్సాఫీస్ వద్ద పెద్ద పోరుగా మారనుంది.

మొదటిగా వస్తోంది ‘చాంపియన్, ఇందులో రోషన్ మేక ఫుట్‌బాల్ ప్లేయర్‌గా కనిపించబోతున్నాడు. నేషనల్ అవార్డు విన్నర్ ప్రదీప్ అద్వైతం దర్శకత్వం వహించిన ఈ స్పోర్ట్స్ డ్రామా సుమారు 50 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కించారు.

తర్వాత వస్తోంది ‘శంభాలా: ఎ మిస్టికల్ వరల్డ్’, ఇది ఆదీ సాయికుమార్ హీరోగా వస్తోంది. ఉగంధర్ ముని దర్శకత్వం వహించిన ఈ సూపర్‌నేచురల్ థ్రిల్లర్ ఒక గ్రామంలో మీటియరైట్ పడటంతో మొదలవుతుంది. ఆ ఘటనతో జరిగే రహస్య మరణాలు కథకు మిస్టరీ కలిగిస్తాయి. ఇందులో ఆర్చన అయ్యర్, స్వసిక విజయ్, రవి వర్మ ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. శ్రీచరణ్ పాకాల సంగీతం అందిస్తున్నారు.

మూడో సినిమా ‘ఫంకీ’, హీరో విశ్వక్ సేన్ మల్లి తన స్టైల్ కామెడీ తో రాబోతున్నాడు. అనుదీప్ తన ప్రత్యేకమైన హాస్య స్టైల్లో ఈ సినిమా తీర్చిదిద్దాడు. హీరోయిన్గా కయాదు లోహర్, సంగీతం భీమ్స్ సెసిరోలియో అందిస్తున్నారు.

తర్వాత ‘పతంగ్’ – డెబ్యూ డైరెక్టర్ ప్రణీత్ ప్రత్తిపాటి తెరకెక్కించిన ఈ చిత్రం కైట్ ఫ్లయింగ్ పోటీ చుట్టూ తిరుగుతుంది. ప్రీతి పగడాలా, వంశీ పుజిత్, ప్రణవ్ కౌశిక్, ఎస్.పి. చరణ్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఇది స్పోర్ట్స్ కామెడీ జానర్లో వచ్చే కొత్త ప్రయత్నంగా చెప్పవచ్చు.

చివరిగా వస్తోంది ‘యూఫోరియా’, దర్శకుడు గుణశేఖర్ దర్శకత్వంలో గ్లోబల్‌గా రిలీజ్ అవబోతుంది. భూమిక చావ్లా, గౌతమ్ వాసుదేవ్ మేనన్, సారా అర్జున్, నాసర్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. భూమిక, గుణశేఖర్ కాంబినేషన్ “ఒక్కడు” తర్వాత మళ్లీ కలవడం ఈ సినిమాకు స్పెషల్ అట్రాక్షన్. కాల భైరవ సంగీతం అందిస్తున్నారు.
ఒకే రోజు ఐదు సినిమాలు – వేర్వేరు జానర్లు – వేర్వేరు ఎమోషన్స్! ఎవరి సినిమా ముందుకు వస్తుందో, ఎవరు వెనక్కి తగ్గుతారో చూడాలి కానీ, ఈ క్రిస్మస్ బాక్సాఫీస్ మీద అసలైన ఫెస్టివ్ ఫైట్ ఖాయం!