మొన్నే దీపావళి సందర్బంగా కిరణ్ అబ్బవరం నటించిన కే-రాంప్ సినిమా రిలీజ్ అయ్యింది… మొత్తం యూత్ కి నచ్చే కంటెంట్ ఉంది కాబట్టి హిట్ కూడా అయ్యింది. ఆల్రెడీ సినిమా కలెక్షన్స్ బ్రేక్-ఈవెన్ దాటేశాయి అని నిర్మాతలు సోషల్ మీడియా లో షేర్ చేసారు కూడా. ఐతే సినిమా హిట్ అయ్యింది అన్న ఆనందం లేకుండా ఒక కాంట్రవర్సీ నడుస్తుంది…
ఈ సినిమా నిర్మాత రాజేష్ మొన్న జరిగిన సక్సెస్ మీట్ లో ఒక website నెగటివ్ రివ్యూ ఇచ్చిందని, అయినా పర్వాలేదు, కానీ ఆ రివ్యూ ఇచ్చిన తరవాత కూడా సినిమా ని ఇంకా చాల నెగటివ్ చేస్తున్నారు చెప్పాడు. అలానే కొంచం పరుష పదజాలం తో ఆ వెబ్సైటు ఓనర్ కి వార్నింగ్ ఇచ్చాడు. అది కాస్త సోషల్ మీడియా లో వైరల్ అయ్యింది. అందుకే ఇందాకే సోషల్ మీడియా లో ఒక పోస్ట్ పెట్టి, తన బాధ ని అందరికి అర్థమయ్యేలా చెప్పాడు రాజేష్…
“మీడియా మిత్రులకు, మీడియా సంస్థలకు విన్నపం.
నిర్మాతగా, పంపిణీ దారుగా రాజేష్ దండా మీడియాతో ఎలాంటి గౌరవ మర్యాదలతో వుంటాడు అన్నది మీడియా మిత్రులు అందరికీ తెలుసు. అలాంటి నేను నిన్న ఎందుకు ఓ వెబ్ సైట్ పట్ల, ఆ వెబ్ సైట్ నిర్వాహకుల పట్ల, పరుషంగా మాట్లాడాల్సి వచ్చింది. కోట్లు ఖర్చు పెట్టి నిర్మాతగా ఓ సినిమా తీసాను. తెలుగు 360 వెబ్ సైట్ దానిని సమీక్షించి, దానికో రేటింగ్ ఇచ్చింది.
అంత వరకు నాకు ఏ అభ్యంతరం లేదు. కానీ సినిమాను జనం ఆదరిస్తున్నారు. ఆ విధంగా సినిమా హిట్ అయితే ఆ సైట్ సమీక్షల క్రెడిబులిటీ పోతుంది. అందుకే వాళ్ల రేటింగ్ ను నిలబెట్టుకోవాలని నా సినిమా మీద నెగిటివ్ పోస్ట్ లు, నెగిటివ్ వార్తలు వేయడం ప్రారంభించారు.
గతంలో మ్యాడ్ 2 సినిమా విషయంలో ఇంకో వెబ్ సైట్ ఇలాగే చేస్తే, నిర్మాత నాగవంశీ ప్రెస్ మీట్ పెట్టి మరీ ఖండించారు. అప్పుడు కూడా ఆయన చెప్పారు. మా మీద ఆధారపడి వెబ్ సైట్ లు నడుపుతూ ఇలా చేయడం తప్పు అని చెప్పారు.
ఇప్పుడు నేనూ అదే చెబుతున్నాను. అయితే నేను వాడిన భాష అభ్యంతరకరం అని అంటున్నారు. కోట్ల రూపాయలు ఖర్చు చేసిన నా సినిమాను చంపేస్తూ, నాకు కోట్ల నష్టం కలిగించే ప్రయత్నం చేస్తుంటే కోపం రాదా..నేనూ మనిషినే కదా. అందుకే అలా మాట్లాడాను. అంతకు మించి మరే మీడియా సంస్థ మీద, మరే మీడియా వ్యక్తి మీద నాకు ఏ కోపం లేదు. పైగా 150 మందికి పైగా వున్న సినిమా జర్నలిస్ట్ లు, సోషల్ మీడియా జనాలు, మీమర్స్ అందరూ నాకు అత్యంత సన్నిహితులే. వారంటే నాకు ఎప్పుడూ గౌరవం వుంటుంది.
నా బాధ, కోపం లో వచ్చిన భాషను సహృదయంతో అర్థం చేసుకుంటారని ఆశిస్తున్నాను
నా యుద్దం మీడియా మీద కాదు
మీడియా ముసుగు లో సినిమా లను చంపుతున్న తెలుగు 360 వెబ్ సైట్ మీద”.
కే రాంప్ సినిమా మూడు రోజుల్లో పదిహేడు కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసింది…