శంషాబాద్ నుంచి ఒంటరిగా వచ్చే మహిళా ప్రయాణికుల కోసం ప్రభుత్వం ప్రత్యేకంగా షీ క్యాబ్స్‌ను ఏర్పాటు చేసింది. మహిళలే డ్రైవర్లుగా ఉండే ఈ షీక్యాబ్స్లో పురుషులకు అనుమతి ఉండదు. కేవలం మహిళలు మాత్రమే ప్రయాణించేందుకు అవకాశం ఉంటుంది. ఒకవేళ మహిళతో పాటు భర్త ఉంటే మాత్రమే అనుమతి ఇస్తారు. కేవలం పురుషులకు ఈ క్యాబ్‌లు అందుబాటులో ఉండవు. ప్రతిరోజూ దాదాపు 90 వేల మంది నగరం నుంచి శంషాబాద్‌కు ప్రయాణిస్తున్నారు. అయితే, ఒంటరిగా ప్రయాణించే మహిళలను క్యాబ్ డ్రైవర్లు బెదిరించి దోచుకోవడం, అత్యాచారం చేయడం వంటివి జరుగుతున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ షీక్యాబ్లు నిత్యం పది వరకు శంషాబాద్‌లో అందుబాటులో ఉంటాయి. నాలుగు సంవత్సరాల డ్రైవింగ్ అనుభవం ఉన్న మహిళలే క్యాబ్ డ్రైవర్లుగా ఉన్నట్టుగా అధికారులు చెబుతున్నారు.
Related Posts
పంచాంగం – ఈరోజు శుభసమయాలు ఎప్పుడు ఉన్నాయంటే
శ్రీ విశ్వావసు నామ సంవత్సరం, దక్షిణాయణం, శరదృతువు ఈరోజు ఆశ్వయుజ మాస బహుళ పక్ష దశమి తిథి ఉదయం 10.35 వరకూ తదుపరి ఏకాదశి తిథి, ఆశ్లేష…
శ్రీ విశ్వావసు నామ సంవత్సరం, దక్షిణాయణం, శరదృతువు ఈరోజు ఆశ్వయుజ మాస బహుళ పక్ష దశమి తిథి ఉదయం 10.35 వరకూ తదుపరి ఏకాదశి తిథి, ఆశ్లేష…
Akhanda 2: Telangana Government Gives Nod To Hike Ticket Prices
It is all known that Nandamuri Balakrishna’s most-awaited movie Akhanda 2 is all set to hit the theatres tomorrow i.e…
It is all known that Nandamuri Balakrishna’s most-awaited movie Akhanda 2 is all set to hit the theatres tomorrow i.e…