శంషాబాద్ నుంచి ఒంటరిగా వచ్చే మహిళా ప్రయాణికుల కోసం ప్రభుత్వం ప్రత్యేకంగా షీ క్యాబ్స్‌ను ఏర్పాటు చేసింది. మహిళలే డ్రైవర్లుగా ఉండే ఈ షీక్యాబ్స్లో పురుషులకు అనుమతి ఉండదు. కేవలం మహిళలు మాత్రమే ప్రయాణించేందుకు అవకాశం ఉంటుంది. ఒకవేళ మహిళతో పాటు భర్త ఉంటే మాత్రమే అనుమతి ఇస్తారు. కేవలం పురుషులకు ఈ క్యాబ్‌లు అందుబాటులో ఉండవు. ప్రతిరోజూ దాదాపు 90 వేల మంది నగరం నుంచి శంషాబాద్‌కు ప్రయాణిస్తున్నారు. అయితే, ఒంటరిగా ప్రయాణించే మహిళలను క్యాబ్ డ్రైవర్లు బెదిరించి దోచుకోవడం, అత్యాచారం చేయడం వంటివి జరుగుతున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ షీక్యాబ్లు నిత్యం పది వరకు శంషాబాద్‌లో అందుబాటులో ఉంటాయి. నాలుగు సంవత్సరాల డ్రైవింగ్ అనుభవం ఉన్న మహిళలే క్యాబ్ డ్రైవర్లుగా ఉన్నట్టుగా అధికారులు చెబుతున్నారు.
Related Posts
ప్రపంచ వినోద రంగం చరిత్రలోనే అతి పెద్ద డీల్
నిజంగా చెప్పాలంటే… OTT ప్రపంచాన్ని పూర్తిగా మార్చేసిన నెట్‌ఫ్లిక్స్ ఇప్పుడు ఒక కొత్త డీల్ తో మళ్ళి వార్తల్లోకి ఎక్కింది. చాలా నెలలుగా వార్తల్లో వినిపిస్తున్న ఆ…
ఇరాన్‌ను ఖతం చేస్తాం…ట్రంప్ గరంగరం
ఇరాన్‌తో కుదిరిన అవగాహన ఒప్పందం (Memorandum of Understanding) ఇక ముగిసిపోయిందని, ఆ దేశంతో చర్చలు జరపడం కేవలం కాలయాపనేనని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంచలన…