శంషాబాద్ నుంచి ఒంటరిగా వచ్చే మహిళా ప్రయాణికుల కోసం ప్రభుత్వం ప్రత్యేకంగా షీ క్యాబ్స్‌ను ఏర్పాటు చేసింది. మహిళలే డ్రైవర్లుగా ఉండే ఈ షీక్యాబ్స్లో పురుషులకు అనుమతి ఉండదు. కేవలం మహిళలు మాత్రమే ప్రయాణించేందుకు అవకాశం ఉంటుంది. ఒకవేళ మహిళతో పాటు భర్త ఉంటే మాత్రమే అనుమతి ఇస్తారు. కేవలం పురుషులకు ఈ క్యాబ్‌లు అందుబాటులో ఉండవు. ప్రతిరోజూ దాదాపు 90 వేల మంది నగరం నుంచి శంషాబాద్‌కు ప్రయాణిస్తున్నారు. అయితే, ఒంటరిగా ప్రయాణించే మహిళలను క్యాబ్ డ్రైవర్లు బెదిరించి దోచుకోవడం, అత్యాచారం చేయడం వంటివి జరుగుతున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ షీక్యాబ్లు నిత్యం పది వరకు శంషాబాద్‌లో అందుబాటులో ఉంటాయి. నాలుగు సంవత్సరాల డ్రైవింగ్ అనుభవం ఉన్న మహిళలే క్యాబ్ డ్రైవర్లుగా ఉన్నట్టుగా అధికారులు చెబుతున్నారు.
Related Posts
కాలభైరవునికి అమావాస్య హారతి
హిందూ సంప్రదాయాలలో అమావాస్యకు ప్రత్యేకమైన ఆధ్యాత్మిక ప్రాముఖ్యత ఉంది. అమావాస్య రోజున చంద్రుడు కనబడకపోవడం వల్ల ప్రకృతిలో చీకటి శక్తులు ఎక్కువగా ప్రభావితం అవుతాయని విశ్వాసం. ఈ…
హిందూ సంప్రదాయాలలో అమావాస్యకు ప్రత్యేకమైన ఆధ్యాత్మిక ప్రాముఖ్యత ఉంది. అమావాస్య రోజున చంద్రుడు కనబడకపోవడం వల్ల ప్రకృతిలో చీకటి శక్తులు ఎక్కువగా ప్రభావితం అవుతాయని విశ్వాసం. ఈ…
విఅజయ్ దేవరకొండ కొత్త సినిమా అప్డేట్ వచ్చేది రేపే…
విజయ్ దేవరకొండ హీరోగా నటిస్తున్న ప్రతిష్ఠాత్మక ప్రాజెక్ట్ VD14పై అంచనాలు రోజురోజుకీ పెరుగుతున్నాయి. రాహుల్ సాంకృత్యాయన్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా బ్రిటిష్ వలస పాలన నేపథ్యంగా…
విజయ్ దేవరకొండ హీరోగా నటిస్తున్న ప్రతిష్ఠాత్మక ప్రాజెక్ట్ VD14పై అంచనాలు రోజురోజుకీ పెరుగుతున్నాయి. రాహుల్ సాంకృత్యాయన్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా బ్రిటిష్ వలస పాలన నేపథ్యంగా…
హనుమంతుని విగ్రహం చుట్టూ ప్రదక్షిణ చేస్తున్న శునకం
బిజ్నోర్ జిల్లా నంద్పూర్ ఖుర్ద్ గ్రామంలోని నంద్లాల్ దేవత మందిరంలో చోటుచేసుకున్న ఒక సంఘటన ఇప్పుడు భక్తుల మనసులను తాకుతోంది. జనవరి 13వ తేదీ ప్రాంతంలో ఆలయ…
బిజ్నోర్ జిల్లా నంద్పూర్ ఖుర్ద్ గ్రామంలోని నంద్లాల్ దేవత మందిరంలో చోటుచేసుకున్న ఒక సంఘటన ఇప్పుడు భక్తుల మనసులను తాకుతోంది. జనవరి 13వ తేదీ ప్రాంతంలో ఆలయ…