కాటన్ దుస్తులు ఎక్కువ రోజులు పాడవ్వకుండా మన్నికగా ఉండాలంటే వాటిని ఎప్పుడూ కూడా వేడినీళ్లలో ఉంచకూడదు. గోరువెచ్చని నీటిలోనే నానబెట్టాలి. రసాయనాలు లేని డిటర్జంట్లు ఉపయోగించి ఉతకాలి. కాటన్ దుస్తులను ఉతికినపుడు వాటిని మాత్రమే వాష్ చేయడం మంచిది. మిగతా దుస్తులను అందులో కలపడం వలన వాటి రంగులు అంటుకునే అవకాశం ఉంటుంది. ఇక కాటన్ చీరలను తీగలపై కాకుండా నేలపైనే ఆరేయడం మంచిది. అంతేకాదు, ఐరన్ చేసే సమయంలో నీళ్లు చల్లుతూ ఐరన్ చేయాలి.
ఇక కాటన్ చీరలను ఉతికిన తరువాత వాటికి గంజిపెట్టడం కూడా ఒక కళే. గంజిపెట్టిన చీరలను ఐరన్ చేయడం వలన ముడతలు లేకుండా చక్కగా ఐరన్ అవుతుంది. కాటన్ దుస్తులను మెయింటైన్ చేయడం చాలా కష్టంతో కూడుకున్నదే. అయితే, వీటిని ధరించినపుడు మనకు హుందాతనం వస్తుంది. హుందాతో పాటు ధరించిన వారి అందం రెట్టింపు అవుతుంది. అందుకే ఈ మధ్యకాలంలో సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్లు శారీ విషయంలో కాటన్‌వైపే మొగ్గుచూపుతున్నారు.