Native Async

తమ రెండో బిడ్డకి జన్నివ్వబోతున్న రామ్ చరణ్ – ఉపాసన…

Ram Charan and Upasana Expecting Their Second Child — Another Mega Family Celebration!
Spread the love

మెగా కుటుంబం మరో సంతోషకరమైన వేడుకకు సిద్ధమవుతోంది. స్టార్ కపుల్ రామ్ చరణ్ – ఉపాసన తమ రెండో బిడ్డను ఆహ్వానించబోతున్నారు. 2023లో క్లిన్ కారా పుట్టిన తర్వాత, ఇప్పుడు మరోసారి తల్లిదండ్రులుగా మారేందుకు ఈ జంట సిద్ధమవుతోంది.

ఈ ఆనంద వార్త తెలిసిన వెంటనే సోషల్ మీడియాలో అభిమానులు సంబరాలు జరుపుకుంటున్నారు. “ఇది మరో మెగా మిరాకిల్” అంటూ నెట్‌లో ఫ్యాన్స్ కామెంట్స్ వెల్లువెత్తుతున్నాయి. మెగా కుటుంబం మొత్తం ఆనంద వాతావరణంలో తేలిపోతోంది.

ప్రస్తుతం ‘పెద్దీ’ సినిమా షూటింగ్‌లో బిజీగా ఉన్న రామ్ చరణ్, తన కుటుంబంతో గడిపే అందమైన క్షణాలను తరచుగా సోషల్ మీడియాలో పంచుకునే ఉపాసన… ఈ సంతోష వార్త షేర్ చేసి మెగా ఫాన్స్ కి పండగ లాంటి వార్త తెలియజేసింది!

క్లిన్ కారా పాపగా మెగా ఫ్యామిలీకి వెలుగులు నింపిన తర్వాత, ఇప్పుడు మరో చిన్నారి రానుందనే వార్తతో చరణ్ – ఉపాసన జీవితాల్లో ఆనందం మరింత రెట్టింపయింది. ఉపాసన తన సీమంతం వీడియో షేర్ చేసి, అందరిని ఆనందపరిచింది. దీపావళి సందర్బంగా మెగాస్టార్ శంకర వర ప్రసాద్ టీం తో పాటు తన సినీ మిత్రులను పిలిచి గ్రాండ్ గా సెలెబ్రేట్ చేసుకున్న సంగతి తెలిసిందే… ఆ వేడుక లోనే ఉపాసన సీమంతం జరిగింది…

మీరు ఆ వీడియో ని చూసేయండి!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *