ఈరోజు రెబెల్ స్టార్ అదే నండి మన డార్లింగ్ ప్రభాస్ పుట్టిన రోజు కాబట్టి, ఫాన్స్ కి పండగే… ఈ పండగని మరింత స్పెషల్ గా చేయడానికి హను రాఘవపూడి టీం తమ సినిమా టైటిల్ పోస్టర్ రిలీజ్ చేసిందోచ్…
హను రాఘవపూడి దర్శకత్వంలో వస్తున్న ఈ భారీ చిత్రానికి ‘ఫౌజీ’ అనే టైటిల్ పెట్టారు. టైటిల్ రివీల్ కంటే ముందు విడుదలైన కాన్సెప్ట్ పోస్టర్, ప్రీ లుక్ పోస్టర్‌లు ఇప్పటికే సినిమాపై expectations ని నెక్స్ట్ లెవెల్ కి పెంచాయి.
ఇక కథ విషయానికి వస్తే, సినిమా 1940ల కాలం నేపథ్యంలో ఉంటుంది… మన స్వాతంత్య్ర సమరానికి ముందరి సంవత్సరాల్లో సాగే ఈ కథ – తిరుగుబాటు, త్యాగం, ధైర్యం కలిసిన ఒక మహాగాథగా రూపుదిద్దుకుంటోంది. ఫౌజీ అంటే ‘సైనికుడు’ అనే అర్థం అని మనకి తెలిసిందే, కానీ ఈ టైటిల్ వెనుక దాగి ఉన్న భావం మరింత లోతైనది.
బ్రిటిష్ జెండా దహనమవుతున్న నేపథ్యంతో రూపొందిన పోస్టర్‌లోని ప్రతీ అంశం సినిమాకు ప్రతీకగా నిలుస్తుంది. పోస్టర్‌లో దాగి ఉన్న సంస్కృత శ్లోకాలు, రహస్య కోడ్‌ల రూపంలో కర్ణుడి పురాణ గాథతో సినిమా అనుబంధాన్ని సూచిస్తున్నాయి.
ప్రభాస్ ఈ సినిమాలో అర్జునుడి నైపుణ్యం, కర్ణుడి స్థైర్యం, ఏకలవ్యుడి కృషి, బ్రాహ్మణుని జ్ఞానం, క్షత్రియుని కర్తవ్యబుద్ధి — ఈ ఐదు లక్షణాల మేళవింపే ఫౌజీ గా కనిపించనున్నాడు.
“A Battalion Who Walks Alone” అనే ట్యాగ్‌లైన్ — దేశం కోసం ఒంటరిగా పోరాడే ఒక వీరుడి గాథ అని చెప్పకనే చెపుతుంది.
మైత్రి మూవీ మేకర్స్, టీ-సిరీస్ కలిసి నిర్మిస్తున్న ఈ చిత్రం విజువల్ ఎక్స్‌ట్రావగాంజాగా రూపుదిద్దుకుంటోంది. ఇమాన్వి హీరోయిన్‌గా నటిస్తుండగా, అనుపమ్ ఖేర్, మిథున్ చక్రవర్తి, జయప్రద, భాను చంద్ర కీలక పాత్రల్లో కనిపించనున్నారు.
ఈ పోస్టర్ తో డార్లింగ్ బర్త్డే ని ఒక సెలబ్రేషన్ గా మార్చేశారు… ఇక ఇప్పుడు ఈ సినిమా ఎప్పుడు పెద్ద తెర మీద చూస్తామా అని గట్టిగ వెయిటింగ్!