మెగాస్టార్ చిరంజీవి హీరోగా, అనిల్ రావిపూడి దర్శకత్వంలో రూపొందుతున్న ‘మన శంకర వర ప్రసాద్ గారు’ సినిమా మీద భారీ అంచనాలు ఉన్నాయ్ అన్న సంగతి తెలిసిందే. మాస్, ఎమోషన్, కామెడీ, ఫ్యామిలీ ఇలా అన్నీ కలిపిన పర్ఫెక్ట్ కమర్షియల్ ఎంటర్‌టైనర్‌గా ఈ సినిమా రూపొందుతోంది.
ఇక ఈ చిత్రానికి మరింత స్టార్ ఆకర్షణ తెచ్చేందుకు దర్శకుడు అనిల్ రావిపూడి, విక్టరీ వెంకటేష్ ను కీలక పాత్రలో తీసుకున్నారు. వెంకటేష్ తన పార్ట్ షూట్‌ను ప్రారంభించగా, చిరంజీవితో కలిసి ఆయన సెట్లో పాల్గొన్నారు. అనిల్ రావిపూడి, ఇప్పటికే వెంకటేష్‌తో F2, F3 వంటి హిట్ చిత్రాలు చేసిన అనుభవంతో, ఈ సారి వీళ్లిద్దరి మీద ఎక్సపెక్టషన్స్ ఓ రేంజ్ లో ఉన్నాయ్.
ఐతే ప్రమోషన్స్ లో తనకి తానే సాటి అనిపించుకునే అనిల్ రావిపూడి, లేటెస్ట్ గా వెంకటేష్ మెగాస్టార్ వీడియో సోషల్ మీడియా లో షేర్ చేసి, సూపర్ అనిపించుకున్నాడు… చిరు వెంకీ ఇద్దరు కూడా సోషల్ మీడియా లో ఈ వీడియో ని షేర్ చేసి అభిమానులను ఖుష్ చేసారు…
సెట్‌లో చిరంజీవి “వెంకీ, వెల్‌కమ్ నా బ్రదర్!” అంటూ పలకరించగా, వెంకటేష్ “చిరు సర్… మై బాస్!” అని స్మైల్‌తో స్పందించారు. ఆ చిన్న మాటలే అభిమానుల్లో ఆనందాన్ని నింపాయి. దర్శకుడు అనిల్ రావిపూడి చెప్పినట్టుగా – “ఇది తెలుగు సినిమాల్లోనే పెద్ద ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా నిలుస్తుంది.”
ఈ చిత్రంలో నయనతార హీరోయిన్‌గా నటిస్తుండగా, సంగీతాన్ని భీమ్స్ సిసిరోలియో అందిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన “మీసాల పిల్ల” సాంగ్ దేశవ్యాప్తంగా ట్రెండ్ అవుతూ సూపర్ హిట్ అయింది.