డార్లింగ్ ప్రభాస్ బర్త్‌డే సందర్బంగా సోషల్ మీడియా తగలబడిపోతుంది… బర్త్‌డే విషెస్ తో పాటు డార్లింగ్ సినిమా పోస్టర్స్ ట్రెండ్ అవుతున్నాయి! ఈ ట్రెండ్ ని మరింత పెంచడానికి, మారుతి రాజా సాబ్ బర్త్‌డే స్పెషల్ పోస్టర్ కూడా వచ్చేసింది…
ఆల్రెడీ మనం రాజా సాబ్ ట్రైలర్ చూసాం కదా… అందులో ప్రభాస్ ని ఒక పక్క దయ్యం గా ఇంకో పక్క హీరో గా చూపించి హైప్ పెంచేశారు. ఇక ఈరోజు కూడా ఒక స్పెషల్ పోస్టర్ రిలీజ్ చేసి, ఫాన్స్ కి పూనకాలు తెప్పించారు…
ఈ పోస్టర్ లో ప్రభాస్ ఒక కార్ పై కూర్చుని ఉండగా, వెనకాల ఒక గుడి లో వేడుక జరుగుతోంది… ఈ పోస్టర్ లో ప్రభాస్ మొత్తం మోడరన్ లుక్ లో సూపర్ గా ఉన్నాడు!
ఈ సినిమా లో ప్రభాస్ తో పాటు సంజయ్ దత్, బోమన్ ఇరానీ, మాళవిక మోహనన్, నిధి అగర్వాల్, రిద్ధి కుమార్, జరీనా వాహబ్, సముత్రకని, వెన్నెల కిశోర్, బ్రహ్మానందం, VTV గణేష్, సత్య, ప్రభాస్ శ్రీను, యోగి బాబు, సప్తగిరి, సుప్రీత్ రెడ్డి, వర లక్ష్మి శరత్ కుమార్, జిష్షు సేన్‌గుప్తా ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు… సినిమా రిలీజ్ కోసం సంక్రాంతి వరకు వెయిట్ చేయక తప్పదు!