Native Async

రెండో వన్డేలోనూ ఓటమి…సీరిస్‌ ఆసిస్‌ కైవసం

Australia Beats India at Adelaide Oval, Secures 2-0 ODI Series Lead Ending 17-Year Unbeaten Streak
Spread the love

ఆడిలైడ్‌ వేదికగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న రెండో వన్డేలోనూ భారత్‌ ఓటమిపాలైంది. మూడు వన్డే సీరిస్‌ను ఆస్ట్రేలియా 2-0తో కైవసం చేసుకున్నది. మొదటి వన్డేలో ఘోరంగా ఓటమిపాలైన ఇండియా రెండో వన్డేలో కాస్త మెరుగైన పరుగులు సాధించింది. టాప్‌ ఆర్డర్‌ పెద్దగా స్కోర్‌ చేయకున్నా రోహిత్‌ శర్మ సమయోచితంగా ఆడి 75 పరుగులు చేయడం, శ్రేయస్‌ అయ్యర్‌ 61 పరుగులు సాధించడంతో భారత్‌ 9 వికెట్ల నష్టానికి 264 పరుగులు చేసింది. 265 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఆస్ట్రేలియా జట్టు 46.2 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 265 పరుగులు సాధించింది. ఆస్ట్రేలియా జట్టులో మ్యాథ్యు షార్ట్స్‌ 74 పరుగులు, కనోలి 61 పరుగులు సాధించి జట్టు విజయంలో కీలక పాత్రను పోషించారు. మిడిల్‌ ఆర్డర్‌లో మిచెల్‌, రెన్‌షా రాణించడంతో ఆస్ట్రేలియా విజయం సాధించింది. గతంలో ఆడిలైడ్‌ గ్రౌండ్‌లో భారత్‌ విజయం సాధిస్తూ వచ్చేది. అయితే, ఈసారి కూడా ఆ రికార్డును కాపాడుకుంటారని అనుకున్నా… ఆస్ట్రేలియా ఆ రికార్డును బ్రేక్‌చేసి విజయాన్ని సొంతం చేసుకున్నది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *