సినిమా షూటింగ్ అంటే చాల ఖర్చుతో కూడుకున్నది కదా… అందుకే మాక్సిమం రామోజీ ఫిలిం సిటీ, అన్నపూర్ణ స్టూడియోస్, ఇలా చాల మటుకు ఇన్డోర్ షూట్ లోనే సినిమాలు కంప్లీట్ చేస్తారు దర్శకులు. కానీ ఎక్కడో అక్కడ పాటలో ఐన, ఫైట్ సీక్వెన్స్ లో ఐన, ఎదో ఒక కొత్త ప్లేస్ ప్రేక్షకులకి చూపించాలని అనుకుంటారు దర్శకులు… అలా 90s వరకు అమెరికా, తరవాత ఆస్ట్రేలియా, ఆ తరవాత ఉక్రెయిన్ ఇక ఇప్పుడు ఆఫ్రికా షూటింగ్ హబ్ లాగ మారింది! ముఖ్యంగా ఆఫ్రికా ఇప్పుడు కొత్త డ్రీమ్ డెస్టినేషన్‌గా మారుతోంది.

మహేష్ బాబు – ఎస్.ఎస్. రాజమౌళి కాంబినేషన్‌లో వస్తున్న SSMB 29 సినిమా ఇప్పటికే సౌత్ ఆఫ్రికాలో ఒక షెడ్యూల్ పూర్తి చేసుకుంది. యాక్షన్, అడ్వెంచర్, మిథాలజీ అన్న మూడు జానర్ల మేళవింపుతో ఈ సినిమా రూపుదిద్దుకుంటోంది. నవంబర్ 16న టైటిల్ గ్లింప్స్ విడుదల చేస్తారని టాక్, అలాగే హైదరాబాద్‌లో ఒక గ్రాండ్ ఈవెంట్‌లో అసలు టైటిల్‌ను రివీల్ చేయనున్నారని సమాచారం. సినిమా పేరు ‘వారణాసి’ అయ్యే అవకాశాలు ఉన్నాయట.

ఇదిలా ఉంటే, మరో భారీ ప్రాజెక్ట్ అయిన ఎన్టీఆర్ – ప్రశాంత్ నీల్ కాంబోలో వస్తున్న డ్రాగన్ కూడా ఆఫ్రికా వైపు దృష్టి సారించింది. అక్టోబర్ 27 నుంచి నార్త్ ఆఫ్రికాలోని ట్యునీషియాలో లొకేషన్ రిక్కీ చేయబోతున్నారు. దీని తర్వాత కొంత విరామం అనంతరం షూట్ మళ్లీ ప్రారంభమవుతుంది. నవంబర్ చివర్లో ఎన్టీఆర్ హైదరాబాద్ షెడ్యూల్‌లో జాయిన్ అవుతారు. తర్వాత టీమ్ నార్త్ ఆఫ్రికా వెళ్లి తదుపరి షెడ్యూల్‌ను ప్రారంభించనుంది.
SSMB 29 ఇంకా డ్రాగన్ – రెండూ భారీ యాక్షన్ డ్రామాలు. కోట్ల బడ్జెట్‌లతో నిర్మితమవుతున్న ఈ చిత్రాలు టాలీవుడ్‌లో కొత్త దృశ్య ప్రపంచాన్ని ఆవిష్కరించనున్నాయి. ఆఫ్రికా సహజసిద్ధమైన అందాలను సరిగ్గా ఉపయోగిస్తే, త్వరలోనే ఆఫ్రికా – తెలుగు సినీ పరిశ్రమకు మరో ప్రధాన షూటింగ్ కేంద్రంగా మారడం ఖాయం.