రష్యా అధ్యక్షుడు పుతిన్ గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. రష్యా అద్యక్షుడిగా పుతిన్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఆయన ప్రజలతో మమేకం కావడం, వారితో ఎక్కువ సమయం గడపడం, వారి నుంచి సలహాలు తీసుకుంటూ ఉండటం చేస్తుంటారు. నిరంతరం తన వర్క్, దేశాన్ని ఎలా ముందుకు నడిపించాలనే ఆలోచనలు, పూర్వపు సోవియట్ యూనియన్‌ను తీసుకురావాలనే ఆశయంతో పనిచేస్తున్నారు. పశ్చిమదేశాల ఆంక్షలను, బెదిరింపులకు ఏమాత్రం లొంగిపోకుండా రష్యాను నడిపిస్తున్నారు. ప్రపంచంలోనే అతిపెద్ద దేశమైన రష్యా ప్రచ్చన్న యుద్ధం తరువాత కొంత మెత్త బడినా పుతిన్ అధికారంలోకి వచ్చిన తరువాత కథ మొత్తం మారిపోయింది.
ఇక ఇదిలా ఉంటే, పుతిన్ ఇటీవలే ఓ కాఫీ షాప్‌కు వెళ్లి అక్కడి కాఫీని టేస్ట్ చేశాడు. పుతిన్ సడెన్‌గా కాఫీ షాపులోకి రావడంతో అందరూ ఒక్కసారిగా ఆశ్చర్యపోయారు. షాప్‌లో కాఫీ తయారు చేస్తున్న వారిని ఆప్యాయంగా పలకరించి వారితో ముచ్చటించారు. వారిని కుశలపశ్నలు వేసి కాఫీ అడిగి తీసుకున్నారు. కాఫీపై రివ్యూ ఇచ్చి వారితో ఫొటో దిగారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నది. ప్రొఫెషనలిజం ముందు ఒక్కోసారి ఆయన ప్రోటోకాల్‌ను కూడా పక్కనపెడుతుంటారు. అధ్యక్షుడు అంటే ప్రజలతో ఉండాలని, ప్రజలతో కలిసి వారి విషయాలు తెలుసుకోవాలని అంటారు. అందుకే పుతిన్ అంటే అక్కడి వారికి మక్కువ ఎక్కువ.