గుజరాత్ సింహాలు చాలా డేంజర్‌గా ఉంటాయి. ఆఫ్రికన్ లైయన్స్ మాదిరిగానే ఇవి బలంగా, చాలా కోపంగా ఉంటాయి. అయితే, ఒక్కోసారి ఈ సింహాలు చాలా ఫ్రెండ్లీగా మూవ్ అవుతుంటాయి. సింహం చనువు ఇచ్చిందికదా అని దానిని పట్టి లాగడానికి ప్రయత్నిస్తే… ఎముకలు కూడా మిగలకుండా నమిలేస్తుంది. అయితే, శుక్రవారం గుజరాత్‌లోని పాలిటానా జైన్ మందిరం ప్రాంతంలో ఓ అద్భుతమైన సన్నివేశం జరిగింది. ఓ జంట జైన్ మందిరాన్ని దర్శించుకొని తిరిగి కొండదిగి వస్తున్న సమయంలో వెనకాలు నాలుగు సింహాలు వారిని అనుసరించాయి.
సహజంగా మన వెనుక కౄరజంతువు ఉన్నది అని తెలిస్తే తెలియకుండానే గుండెజారిపోతుంది. పరిగెత్తేందుకు ప్రయత్నిస్తాం. ఒకవేళ అలా పరిగెత్తితే…అదే ఆఖరు అవుతుంది. మనం పరిగెత్తకుండా మనం దానిని చూడనట్టుగా ఉంటూ కామ్‌గా నడుచుకుంటూ వెళ్తే చాలు… సింహం కూడా ఏమనదు. దానిని చూసి పరిగెత్తాలని చూసినా, లేదా దానికి ఏదైనా అపాయం కలిగించాలని చూసినా మనల్ని వేటాడుతుంది. ఇక్కడ ఈ జంట ఎవరో చాలా తెలివైన వారు అయి ఉంటారు. వెనుక సింహాలు వస్తున్నా… చూడనట్టుగా నడుచుకుంటూ ముందుకు కదిలి ప్రాణాలు కాపాడుకున్నారు.