Native Async

కథలు మార్చాలి…

Bollywood’s Cinematic Universes Losing Steam: Audience Demand Fresh Stories Over Repeated Formulas
Spread the love

ఇటీవలి కాలంలో ‘సినిమాటిక్ యూనివర్స్’ అనేది ఒక కామన్ టాపిక్ అయిపోయింది… ఇంతకూ ముందు ఇది ప్రేక్షకుల్లో ఒక ఆసక్తిని సృష్టించేది… కానీ ఇప్పుడు అంతా నార్మల్ అయిపోయింది!

హాలీవుడ్ ప్రభావంతో భారతీయ దర్శకులు కూడా కనెక్టెడ్ స్టోరీలతో, రికరింగ్ క్యారెక్టర్లతో కొత్త కొత్త యూనివర్స్‌లను సృష్టించడం మొదలుపెట్టారు. బాలీవుడ్ లో యాష్‌రాజ్ ఫిలిమ్స్ స్పై యూనివర్స్, మ్యాడాక్ ఫిలిమ్స్ హారర్ కామెడీ యూనివర్స్ లాంటి ప్రాజెక్టులు వరుసగా హిట్లు కొట్టాయి. వార్, పఠాన్, భేడియా, స్త్రీ 2 వంటి సినిమాలు ఆ ఉత్సాహాన్ని రెట్టింపు చేశాయి.

కానీ ఈ ఏడాది మాత్రం పరిస్థితి తారుమారైంది. కంటెంట్ బలంగా లేకుండా సినిమాలను లింక్ చేయడం ఇప్పుడు ఈ ఫార్ములా పని చేయడం లేదు. ప్రేక్షకులు ఇప్పుడు కథలలో కొత్తదనం కోరుతున్నారు.

అందుకే యాష్‌రాజ్ స్పై యూనివర్స్ లో వచ్చిన వార్ 2 పెద్ద బజ్ ఉన్నప్పటికీ ప్లాప్ అయ్యింది. ఫ్రాంచైజీ లెవల్ కి తగ్గ ఓపెనింగ్ రాలేదు. అదే విధంగా ‘తమ్మా’ మొదట మంచి టాక్ తెచ్చుకున్నా, రెండో రోజుకే పతనం మొదలైంది.

ట్రేడ్ అనలిస్టుల మాటల్లో ఇది బాలీవుడ్ స్టూడియోలకి మొదటి హెచ్చరిక. కేవలం యూనివర్స్ ఫేస్ కొనసాగించాలనే ఉద్దేశ్యంతో కథ లేకుండా సినిమాలు తీయడం అనేది మొత్తంగా ఆ కాన్సెప్ట్‌కి నష్టం చేయొచ్చు. ప్రేక్షకులు ఇప్పుడు మరింత అవగాహనతో, సెలెక్టివ్‌గా చూస్తున్నారు. పెద్ద పేర్లు, కనెక్టెడ్ యూనివర్స్‌లు మొదట బజ్ క్రియేట్ చేస్తాయి కానీ, నిలబడేది మాత్రం కంటెంట్ ఉన్న సినిమా మాత్రమే.

అందుకే బాలీవుడ్ ఈ యూనివర్స్ కాన్సెప్ట్‌ని బ్రతికించాలంటే, మొదట కథ మీద, ఎమోషన్ మీద దృష్టి పెట్టాలి. లేదంటే ఇప్పటి వరకూ లాభాలు తెచ్చిన ఈ ఫార్ములా రేపు భారంగా మారే ప్రమాదం ఉంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *