ఆల్రెడీ నయనతార చిరంజీవి నెక్స్ట్ సినిమా ‘మన శంకర వార ప్రసాద్ గారు’ లో నటిస్తుందని తెలిసిందే… ఈ సినిమా వచ్చే సంక్రాంతికి థియేటర్స్ లో ఉండడం ఖాయం! ప్రస్తుతం ప్రమోషన్లలో నయనతార మెరిసిపోతుండడంతో, ఆమె గ్లామర్, గ్రేస్ రెండూ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి. ఐతే, నయన్ అంటే మన తెలుగు ప్రేక్షకులకు ఎంత ఇష్టమో తెలిసిందే కదా… అందుకే మీకు ఒక శుభ వార్త…

మన బాలయ్య హీరోగా తెరకెక్కబోయే తదుపరి చిత్రానికి కూడా నయనతారనే హీరోయిన్‌గా ఫైనల్ చేసినట్లు వార్తలు వస్తున్నాయి. ఇప్పటికే వీరి జంటగా సింహా, శ్రీరామ రాజ్యం, జై సింహా వంటి సూపర్ హిట్లు వచ్చాయి కాబట్టి, నాలుగోసారి వీరి కాంబినేషన్ వస్తుందన్న వార్తతో అభిమానుల్లో జోష్ నెలకొంది.

ఈ సినిమాను గోపిచంద్ మలినేని దర్శకత్వం వహించనుండగా, ఇది ఆయనకు బాలయ్యతో రెండవ చిత్రం. ఈ సినిమా పీరియడ్ యాక్షన్ డ్రామాగా, ఫ్యాక్షన్ ఎలిమెంట్స్‌తో సాగేలా ప్లాన్ చేసినట్లు సమాచారం. ఇందులో నయనతార పాత్ర చాలా ముఖ్యమైనదిగా ఉండనుంది.
ఇక ఈ సినిమా ఓటిటి భాగస్వామ్యాన్ని ఇప్పటికే లాక్ చేసుకోవడంతో, ఫిల్మ్ సర్కిల్స్‌లో చర్చలు జోరుగా నడుస్తున్నాయి. నయనతార చేరికతో సినిమాకు మరింత హైప్ పెరిగే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి.
మరి ప్రస్తుతం చిరంజీవితో చేస్తున్న మన శంకర వర ప్రసాద్ గారు సినిమా హిట్ అయితే, ఆ సక్సెస్ బాలకృష్ణ సినిమాకు కూడా మంచి బూస్ట్ ఇవ్వనుంది. మరోవైపు, నయనతార ఇప్పుడు తమిళ సినిమాల కన్నా తెలుగు ప్రాజెక్టుల మీదే ఎక్కువ దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది. అనగా, లేడీ సూపర్ స్టార్ కెరీర్‌లో కొత్త అధ్యాయం మొదలైనట్టే!