Native Async

కాంతారా హిట్ వెనకాల రిషబ్ శెట్టి కృషి ఎంత ఉందొ తెలుసా?

Rishab Shetty’s Dedication Behind Kantara | Dual Role, Makeup & Hard Work Story
Spread the love

క సినిమా హిట్ అవ్వాలంటే మాములు విషయం కాదు కదా! అదే కాంతారా సినిమా గురించి మాట్లాడుకుంటే, అబ్బో ఆ సినిమా షూటింగ్ టైం లో ఎన్ని అవరోధాలు వచ్చాయో మనకి తెలుసు కదా. అవన్నీ దాటుకుని రిషబ్ శెట్టి సినిమా ని హిట్ చేసాడు…

అందుకే రిషబ్ శెట్టి చేసిన కాంతారా సినిమా వెనుక ఉన్న శ్రమ, నిబద్ధత నిజంగా ఒక అద్భుతం లాంటిది. ఒక నటుడిగా మాత్రమే కాకుండా, దర్శకుడిగా కూడా తన 100 % శ్రమ, టాలెంట్ మొత్తం ఈ చిత్రంలో చూపించాడు.

సినిమా రిలీజ్ అయ్యి హిట్ ఐన ఇన్ని రోజులకి రిషబ్ నిన్న మేకింగ్ వీడియో ని షేర్ చేసి, తాను ఎంతలా కష్టపడ్డాడో చూపించాడు…

రిషబ్ ఈ సినిమాలో రెండు వేర్వేరు పాత్రలు పోషించాడు — బెర్మే ఇంకా మాయకర. బెర్మే ప్రధాన పాత్ర కాగా, మాయకర అనే పాత్ర ఫ్లాష్‌బ్యాక్‌లో కనిపిస్తుంది. మాయకర పాత్రలో రిషబ్ 60 ఏళ్ల వృద్ధ మత్స్యకారుడిగా కనిపిస్తాడు. ఆ పాత్రలో బాడీ లాంగ్వేజ్, ప్రతీ ఫ్రేమ్‌లోనూ నిజంగా మనం ఆ వ్యక్తిని చూసినట్టే అనిపిస్తుంది.

మాయకర పాత్రలో అతను చేసే ప్రయాణం కూడా చాలా ప్రత్యేకం. సముద్రతీరంలో మత్స్యకారుడిగా జీవిస్తున్న అతను ఒకరోజు విలువైన మసాలా పౌచ్ దొరకడం వల్ల, కాంతారా అడవుల్లోని పవిత్ర మసాలా తోటను స్వాధీనం చేసుకోవాలనే ఆశ కలుగుతుంది. ఈ పాత్ర కోసం రిషబ్ ప్రోస్థెటిక్ మేకప్ వేసుకున్నాడు — అది వేసుకోవడానికి ప్రతి రోజు దాదాపు ఆరు గంటలు పడేది.

దర్శకుడిగా ఒక సినిమా నడిపించడం ఎంత కష్టం అంటే, ఆ మధ్యే నటుడిగా రెండు కఠినమైన పాత్రలను పోషించడం అంతకంటే కష్టం. అయినా కూడా, సినిమాపై ఉన్న ఆయన ప్రేమ, అంకితభావం, తపన — ఇవన్నీ ఆయనను ఆ స్థాయిలో పనిచేయించాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *