Native Async

నేలపై 414 కిలోమీటర్ల వేగంతో ప్రయాణం…సాధ్యం చేసిన బుగాటి

Man Drives Bugatti Chiron at Record 414 kmh Speed on Germany’s Autobahn — Viral Supercar Video
Spread the love

నేలపై నడిచే లగ్జరీకార్లలో బుగాటీ కూడా ఒకటి. జర్మనీకి చెందిన ఈ కంపెనీకి చెందిన కార్లు హుందాతనానికి, గౌరవానికి ప్రతీకగా మాత్రమే కాకుండా వేగానికి ప్రతిరూపంగా కూడా చెబుతారు. వేగంగా ప్రయాణంచే కార్లలో బుగాటీ కూడా ఒకటి. అయితే, ఇటీవలే ఈ జర్మన్‌ కంపెనీకి చెందిన బుగాటీ చిరాన్‌ కారు ప్రపంచరికార్డును సాధించింది. ఇప్పటి వరకు ఆకాశంలో విమానం, పట్టాలపై రైళ్లు సాదించిన ఘనతను నేలపై పరుగులు తీసే కారు కూడా సాధించింది. ఏకంగా గంటకు 414 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించి ప్రపంచరికార్డును సృష్టించింది. అయితే, రోడ్లపై ఇంత వేగం సాధ్యమేనని చెబుతున్నా… ట్రాఫిక్‌ సమస్యలు, రోడ్డుపై వాహనాల గమనం ఆధారంగా ఇంత వేగాన్ని అందుకోవడం చాలా కష్టం. నిర్మాణుష్యంగా ఉండే హైవే రోడ్లపై మాత్రమే ఇలాంటి సాధ్యమౌతాయి. ఇంత వేగంతో ప్రయాణం చేసే సమయంలో ఆ వేగాన్ని కంట్రోల్‌ చేసేందుకు లేదా బ్రేకులు వేసేందుకు కూడా అధునాతనమైన వ్యవస్థలు ఉండాలి. సడన్‌గా ఎవరైనా అడ్డువచ్చినా లేదా ఏదైనా వాహనం అడ్డుగా ఉన్నా ప్రాణాలు గాల్లో కలిసిపోవాల్సిందే. సాధారణంగా 100 లేదా 140 కిలోమీటర్ల వేగంతో ప్రయాణం చేస్తేనే కార్లు మన కంటికి కనిపించనంత వేగంగా పోతున్నాయని అంటాం. ఇక 414 కిలోమీటర్ల వేగంతో ప్రయాణం చేస్తే… రాపిడికి టైర్లు మండిపోతాయి. ఇక్కడ విచిత్రమేమంటే టైర్లు కూడా ఈ రికార్డుకు సహకరించాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

🔔 Subscribe for Latest Articles
Share: FacebookX/TwitterTelegramWhatsAppLinkedInReddit