Native Async

కార్తీకమాసంలో మహాకాళేశ్వరుని దర్శనం

Karthika Masam Mahakaleshwar Darshan – Significance of Bhasma Aarti in Ujjain Jyotirlinga
Spread the love

దేవతలు సైతం ఎంతో భక్తిశ్రద్ధలతో పూజించే మహాకాళేశ్వరుడిని కార్తీకమాసంలో తప్పనిసరిగా దర్శించుకోవాలి. భక్తితత్పరతకు మహాకాళేశ్వర లింగం చిహ్నం. దూషణుడు అనే రాక్షసుడిని మహాశివుడు కాలుడి రూపంలో శివలింగం నుంచి ఉద్భవించి అంతం చేస్తాడు. అక్కడి బ్రాహ్మణోత్తముడి కోరికమేరకు జ్యోతిర్లింగం రూపంలో ఆవిర్భవిస్తాడు. రాక్షసుడిని మహాకాళుడి రూపం అంటే ఉగ్రరూపంలో ఆవిర్భవించి అంతం చేశాడు కాబట్టి ఈ శివలింగానికి మహాకాళుడు అనే పేరు వచ్చింది. ఉజ్జయినీలో మహాళేశ్వర జ్యోతిర్లింగం ఉన్న ఆలయం ఐదు అంతస్తులుగా ఉంటుంది. క్రిందిభాగంలోని మహాకాళుడికి నిత్యం ప్రాతఃకాలంలో జరిగే విభూతి భస్మాభిషేకం చూసి తీరాల్సిందే. కార్తీకమాసంలో ఈ అభిషేకాన్ని కన్నులారా దర్శించినవారి జన్మ ధన్యమౌతుందని చెబుతారు. దేవతలు సైతం ఆ భస్మాభిషేకం, భస్మహారతికి హాజరవుతారని అంటారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

🔔 Subscribe for Latest Articles
Share: FacebookX/TwitterTelegramWhatsAppLinkedInReddit