1950ల నేపథ్యంలో రూపుదిద్దుకున్న పీరియడ్ డ్రామా కాంతాలో దుల్కర్ సల్మాన్ మరోసారి తన ప్రత్యేక శైలిని చూపేందుకు సిద్ధమయ్యాడు. సెల్వమణి సెల్వరాజ్ దర్శకత్వంలో వస్తున్నా ఈ సినిమా ఒక పీరియాడిక్ ఎక్స్పరిమెంట్ అని చెప్పాలి…
ఈ సినిమా మ్యూజికల్ జర్నీలో భాగంగా మరో పవర్ఫుల్ సాంగ్ ఈరోజు విడుదలైంది — అదే ‘రేజ్ ఆఫ్ కాంతా’. జాను చాంతర్ అందించిన ఈ కాంపోజిషన్… దుల్కర్ క్యారెక్టర్‌కు బలమైన ఇంపార్టెన్స్ ని ఇస్తూ, తమిళ్–తెలుగు లిరిక్స్ తో వచ్చే రాప్ స్టైల్ సాంగ్. భాషలు వేరే అయినా భావం ఒకటేనని, కల్చర్ ఒకటేనని, ఎమోషన్స్ ఒకటేనని చెప్పే ఓ పాట ఇది…
ఈ సాంగ్‌లో దుల్కర్ పాత్ర ప్రయాణం అందంగా చూపించారు — స్క్రీన్‌పై ఎన్నో పాత్రలు పోషించి, తన నటనతో కోట్లాదిమందిని ఫ్యాన్స్‌గా మార్చుకున్న స్టార్‌గా, ఆయన జర్నీకి ఈ రాప్ మరింత రక్తి చేకూర్చింది.