తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నిన్న ముంబైకి వెళ్లి, మాజీ కేంద్ర మంత్రి సునిల్ కుమార్ షిండే గారి కుటుంబంలో జరిగిన పెళ్లి వేడుకల్లో పాల్గొన్నారు అన్న సంగతి తెలిసిందే. ఈ వేడుక ఓ ప్రత్యేకమైన మీటింగ్ వేదిక అయ్యింది…
అదేంటో తెలుసా??? మన బాలీవుడ్ కింగ్ ఖాన్ సల్మాన్ ఖాన్ తో మన సీఎం రేవంత్ రెడ్డి కలవడమే. ఇద్దరు చాల సేపు మాట్లాడుకున్నారు సమాచారం!
వారిద్దరి మాటల్లో రాష్ట్రం అభివృద్ధి, భవిష్యత్ విజన్ వంటి ముఖ్యమైన అంశాలు చర్చకు వచ్చాయని తెలుస్తోంది. ఈ ఇద్దరు ఎనర్జిటిక్ వ్యక్తులు ఒకే ఫ్రేమ్‌లో కనిపించడంతో, ఆ ఫోటో సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. నెటిజన్లు కూడా “సదర్న్ పాలిటిక్స్ కలిసిన బాలీవుడ్ స్టార్‌డమ్!” అంటూ షేర్ చేస్తున్నారు.
సల్మాన్ ఖాన్ కూడా తెలంగాణ మోడల్ ను ప్రశంసిస్తూ, రేవంత్ రెడ్డి గారు రాష్ట్రంలో తీసుకువస్తున్న అభివృద్ధి పట్ల తన అభినందనలు తెలిపారట.