ఈరోజు మన దేశ ఉక్కు మనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి సందర్బంగా నిర్వహించిన ర్యాలీ లో మెగాస్టార్ చిరంజీవి పాల్గొన్నారు… అలానే ఆ ఫోటో లు సోషల్ మీడియా లో షేర్ చేస్తూ, ఉక్కు మనిషి గొప్పతనాన్ని స్మరించుకున్నారు…
“‘భిన్నత్వంలో ఏకత్వం’ అనే భావనను సుసాధ్యం చేసి, స్వాతంత్ర్యం అనంతరం రాజకీయ సరిహద్దులను చెరిపి, సమైక్య భారతదేశాన్ని ఆవిష్కరించిన “ఉక్కు మనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్” గారి జయంతి సందర్భంగా… ఆ మహనీయుడి సేవలను స్మరించుకుంటూ.. అందరికీ జాతీయ ఐక్యతా దినోత్సవ శుభాకాంక్షలు. ఆయన స్పూర్తిని, సందేశాన్ని భావి తరాలకు అందజేయడం కోసం ఈ రోజు తలపెట్టిన కార్యక్రమాన్ని, సమర్ధవంతంగా నిర్వహించిన DGP శివధర్ రెడ్డి గారికి, నగర కమీషనర్ V.C సజ్జనార్ గారికి, పోలీస్ సిబ్బందికి నా అభినందనలు, మరియు ధన్యవాదాలు.”