హనుమాన్ సినిమా బ్లాక్‌బస్టర్ అయ్యిన తర్వాత దర్శకుడు ప్రశాంత్ వర్మ పలువురు ప్రొడక్షన్ హౌస్‌ల నుండి అడ్వాన్స్‌లు తీసుకున్నారన్న వార్తలు సోషల్ మీడియాలో వచ్చాయి. అందులో భాగంగా డీవీవీ ఎంటర్టైన్‌మెంట్స్ పేరు కూడా వచ్చింది. కానీ ఇప్పుడు డీవీవీ సంస్థ ఇవన్నీ పుకార్లేనని స్పష్టంగా చెప్పింది…
ఒక అధికారిక ప్రకటన విడుదల చేస్తూ…
“దర్శకుడు ప్రసాంత్ వర్మ గారితో ఎలాంటి డబ్బు లావాదేవీ, ఎలాంటి ఒప్పందం, ఎలాంటి ప్రొఫెషనల్ కనెక్షన్ కూడా మాకు లేదు. బయట వస్తున్న వార్తలు పూర్తిగా అసత్యం” అని చెప్పింది.
హనుమాన్ తర్వాత ప్రశాంత్ వర్మ పేరు ఇండస్ట్రీలో చాలా పెద్ద స్థాయిలో వినిపిస్తున్న సమయంలో ఈ క్లారిటీ రావడంతో అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు. ప్రస్తుతం ప్రశాంత్ అధిరా ఇంకా మహాకాళి సినిమాలకి ప్రేసెంటెర్ గా ఇంకా జై హనుమాన్ కి డైరెక్టర్ గా వర్క్ చేస్తున్నారు!