టాలీవుడ్ యంగ్ హీరో రోషన్ మేక టాలెంట్ ఆల్రెడీ మనం చూసాం… హీరో శ్రీకాంత్ కొడుకైన కానీ, తనకంటూ సెపెరేట్ బజ్ create చేసుకుంటున్నాడు. అలానే వైజయంతి లేదా స్వప్న మూవీస్ ఏదైనా సినిమా ప్రొడ్యూస్ చేస్తుందంటే, దానికి ఎదో ఒక స్పెషలిటీ ఉంటుంది ఎందుకంటే అవి స్టార్ ప్రొడ్యూసర్ అశ్విని దత్ కూతుర్లవి కాబట్టి… కంటెంట్ ఉంటేనే సినిమా అక్కడవరకు వెళ్తుంది…
ఈ సినిమా ఒక పీరియడ్ స్పోర్ట్స్ డ్రామా. అలాగే రోషన్ తో పాటు అనస్వారా రాజన్ హీరోయిన్ గా నటిస్తున్నారు. నేషనల్ అవార్డ్ విన్నర్ ప్రదీప్ అడ్వైతం దర్శకత్వం వహిస్తుండగా, ప్రముఖ సంస్థ జీ స్టూడియోస్ ఈ సినిమా ను ప్రెజెంట్ చేస్తోంది.
ఇక ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్న ఈ సినిమా టీజర్ జస్ట్ ఇప్పుడే రిలీజ్ అయ్యి అంచనాలు పెంచేసింది…
ఈ సినిమా స్వతంత్రం రాకముందు కాలంలో సాగే ఈ కథ… ఈ కథ లో మైఖేల్ సి విలియమ్స్ అనే ఆర్మీ ఆఫీసర్ గా రోషన్ కనిపించాడు. ఫుట్‌బాల్ పై ఇష్టం… విజయాన్ని అందుకోవాలన్న తపన… ఎదురు వచ్చిన ప్రతి అడ్డంకిని ధైర్యంతో దాటిపోతూ, కలల వైపు పరుగెత్తే యువకుడి స్ఫూర్తిదాయక జీవితం… ఇవన్నీ మన కళ్ల ముందుగానే జరగుతున్నట్టుగా చూపించింది ఈ టీజర్.
ఈ టీజర్మి లో మిక్కీ జె మేయర్ అందించిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ అయితే goosebumps తెప్పించేలా ఉంది. ప్రేమ, యాక్షన్, దేశభక్తి, స్పోర్ట్స్ ఎమోషన్స్—అన్నీ ఒకే ఫ్రేమ్‌లో అద్భుతంగా కలిసిపోయాయి.
మైఖేల్ గా రోషన్ నటన అద్భుతం. ఆర్మీ ఆఫీసర్ గా… ఫుట్‌బాల్ ప్లేయర్ ప్యాషన్… ఎమోషన్స్… ప్రతి ఫ్రేమ్ లోనూ కనపడుతున్నాయి.
ఈ సినిమా క్రిస్మస్ సందర్బంగా 25th న రిలీజ్ అవ్వడానికి రెడీ గా ఉంది!