అల్లు శిరీష్ ఎంగేజ్‌మెంట్… ఇది కేవలం ఒక ఈవెంట్ కాదు, రెండు పెద్ద సినీ కుటుంబాలు ఒకే వేదికపై కలిసి సంతోషాన్ని పంచుకున్న అమేజింగ్ ఈవెంట్. చాలా రోజులుగా అల్లు ఫామిలీ, మెగా ఫామిలీ కి పడడం లేదు అని చాల పుకార్లు వచ్చాయి…

కానీ ఈ ఎంగేజ్మెంట్ పిక్స్, వీడియోస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి… వీటిలో చిరంజీవి, రామ్ చరణ్, వరున్ తేజ్ లాంటి కుటుంబ సభ్యులు ఒకే చోట కనిపించడంతో, అభిమానుల పండగ చేసుకున్నారు. పావన్ కళ్యాణ్ హాజరు కాకపోయినా, ఆయన భార్య అన్నా వచ్చి శుభాకాంక్షలు చెప్పడం ప్రత్యేకంగా నిలిచింది.
చిరంజీవి సాధారణ డ్రస్సింగ్‌లోనూ మెరిసిపోయారు, రామ్ చరణ్ సంప్రదాయ వేషధారణలో అందరి దృష్టిని ఆకర్షించారు. నాగబాబు కుటుంబ సమేతంగా వచ్చారు, సాయి ధరమ్ తేజ్, వైష్ణవ్ తేజ్‌లు కూడా ఎంగేజ్‌మెంట్ వేదికపై సందడి చేశారు.
అల్లు అర్జున్ అయితే స్వయంగా అతిథుల్ని ఆహ్వానిస్తూ ఆకట్టుకున్నారు… స్నేహ, అర్హ, ఆయన అందరు భలేగా మురిసిపోయారు…
అందుకే ఈ వేడుక… మెగా – అల్లు కుటుంబం ఒకటే అనే భావనను మళ్ళీ బలపరిచింది..