ఆమ్మో మన జాన్వీ కపూర్ ఏంటి ఆ పేరేంటి అనుకునేరు… తన పేరు ‘అచ్చాయమ్మా’ మార్చారు రామ్ చరణ్ ‘పెద్ది’ సినిమా లో మరి. నిన్నే ఈ బాలీవుడ్ ముద్దుగుమ్మ ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ చేసి మరి తనని అచ్చ తెలుగు పల్లెటూరు అమ్మాయి ‘అచ్చాయమ్మా’ గా పరిచయం చేసారు…
ఏ మాట కి ఆ మాటే కానీ సూపర్ గా ఉంది జాన్వీ ఆ పోస్టర్ లో… ఒక దాంట్లో జీప్ లో నుంచుని జనాలకి దండాలు పెడుతుంది… కళ్ళజోడు స్పీకర్ లు పెట్టుకుని మరి… ఇంకో పోస్టర్ లో స్పీచ్ లు ఇచ్చేస్తుంది మరి… రెండు పోస్టర్స్ అదిరిపోయాయి.
రామ్ చరణ్ కూడా జాన్వీ కపూర్ పోస్టర్స్ సోషల్ మీడియా లో షేర్ చేసి ఫాన్స్ ని ట్రీట్ చేసాడు…
ఇంతకీ ఈ సినిమా బుచ్చి బాబు సన డైరెక్ట్ చేస్తుండగా, మైత్రి మూవీ మేకర్స్ ఇంకా సుకుమార్ రైటింగ్స్ బ్యానర్స్ కింద నిర్మిస్తున్నారు…