నిన్నటి మ్యాచ్ అస్సలు ఎవ్వరు మర్చిపోలేరు…ఇండియన్ విమెన్ క్రికెట్ టీం ఇప్పటి వరకు వరల్డ్ కప్ గెలవలేదు అని అంటూ ఉంటారు. ఆ ఎం చేస్తారు వీళ్ళు అన్నారు… లీగ్ స్టేజి లో మూడు matches ఓడిపోతే ఇంకా అంటే సొంత గడ్డ పై కూడా వరల్డ్ కప్ గెలువలేరు అన్నారు.
కానీ మన అమ్మాయిలు గెలిచి చూపించారు… ఇది చాలదు, ఇక మన దేశం లో ఆడపిల్లకి కూడా క్రికెట్ మీద మమకారం పెరగడానికి. నిన్న మ్యాచ్ లో ఎన్నో హై పాయింట్స్, అలానే low పాయింట్స్ కూడా ఉన్నాయ్. దక్షిణ ఆఫ్రికా టీం లో కెప్టెన్ Laura సెంచరీ చేసి తన టీం ని గెలిపించినంత పని చేసింది. కానీ ఆ ఒక్క Amanjeet క్యాచ్ మన మెన్ T20 వరల్డ్ కప్ లో సూర్య కుమార్ పట్టిన క్యాచ్ లా ఎప్పటికి గుర్తుండి పోతుంది.

ఇక తెలుగు అమ్మాయి శ్రీ చరని బౌలింగ్, దీప్తి ఐదు వికెట్స్ ఇంకా తన 50 రన్స్ అలాగే షెఫాలీ బౌలింగ్, బాటింగ్ అంత సూపర్బ్… అందరు బాగా ఆడారు. లాస్ట్ కి కెప్టెన్ హర్మన్ ప్రీత్ చేతిలో ఆలా బాల్ పడిందో లేదో, వరల్డ్ కప్ మనదే అని తెలిసిపోయింది.
ఇలా అందరు బాగా ఆడి, రిటైర్డ్ ప్లేయర్స్, ఝులన్, మిథాలీ చేతుల్లో వరల్డ్ కప్ పెడుతుంటే, ఇటుక ఇటుక పేర్చిన వాళ్ళకి తగిన గౌరవం ఇస్తున్నట్టు అనిపించింది…
మొత్తానికి రోహిత్ శర్మ కళ్ళల్లో ఆ నీళ్లు చాలదు ఈ మ్యాచ్, ఈ కప్ ఎంత గొప్పదో చెప్పడానికి!