కేరళ రాష్ట్ర సినీ పరిశ్రమలో ప్రతిష్టాత్మకమైన 55వ రాష్ట్ర ఫిల్మ్ అవార్డ్స్ సోమవారం త్రిస్సూర్‌లో ప్రకటించారు. సాంస్కృతిక శాఖ మంత్రి సాజీ చెరియన్ అధ్యక్షతన జరిగిన ఈ వేడుకలో అభినందనలు వెల్లువెత్తాయి. మొత్తం 128 చిత్రాలు పంపగా, వాటిలో 38 సినిమాలు ఫైనల్ రౌండ్‌కి చేరాయి. నటుడు-దర్శకుడు ప్రకాశ్ రాజ్ జ్యూరీ చైర్మన్‌గా ఉండగా, రంజన్ ప్రమోద్ం, జిబు జెకబ్, భాగ్యలక్ష్మి, గాయత్రీ అశోకన్, నితిన్ లుకోస్, సంతోష్ ఎచిక్కణం, సి.అజోయ్ సభ్యులుగా ఉన్నారు.
ఈ అవార్డుల్లో సూపర్ హైలైట్ — మంజుమ్మెల్ బాయ్స్. ఒకేసారి పది అవార్డులు కొట్టేసి, బెస్ట్ ఫిల్మ్, బెస్ట్ డైరెక్టర్, బెస్ట్ ఒరిజినల్ స్క్రీన్‌ప్లే అవార్డులు సాధించి చరిత్ర సృష్టించింది. దర్శకుడు చిదంబరం చేసిన మ్యాజిక్కి ప్రేక్షకులు, జ్యూరీ అందరూ ఫిదా అయ్యారు.
లెజెండరీ స్టార్ మమ్ముట్టి ‘బ్రహ్మయుగం’ సినిమాకు బెస్ట్ యాక్టర్ అవార్డు అందుకున్నారు — ఇది ఆయనకి ఈ కేటగిరీలో తొమ్మిదవ అవార్డు… ఏమి నటుడంటే మాటలకు అందదు!
అలాగే ‘ఫెమినిచి ఫాతిమా’ చిత్రంలో అద్భుత నటనతో షంలా హమ్జా బెస్ట్ యాక్ట్రెస్ గౌరవం అందుకున్నారు.