Native Async

వరల్డ్ కప్ ఫైనల్ లో కూడా SSMB 29 హవా నే…

SSMB29 Title Launch: Rajamouli & Mahesh Babu Gear Up For a Mega Event on November 15
Spread the love

రాజమౌళి చేతిలో ఓ సినిమా అంటే… అది కేవలం సినిమా కాదు… ప్రపంచం మొత్తం చూసే సినీ పండగ! ఇప్పుడు మహేష్ బాబు – రాజమౌళి కాంబోలో వస్తున్న SSMB29 కూడా అదే స్థాయిలో అద్భుతంగా రూపుదిద్దుకుంటోంది.

ఈ భారీ ప్రాజెక్ట్ టైటిల్ లాంచ్ నవంబర్ 15న రామోజీ ఫిల్మ్ సిటీలో గ్రాండ్ గా జరగబోతోంది. అందుకే ఇప్పటినుంచే హైప్ ఆకాశాన్ని తాకుతోంది. సాయంత్రం 6 గంటలకు ప్రారంభమయ్యే ఈ ఈవెంట్‌కు ఇండియన్ సినిమా పెద్దలు, హాలీవుడ్ ప్రతినిధులు, ప్రపంచవ్యాప్తంగా మీడియా హాజరుకానున్నారు.

ఫ్యాన్స్ విషయానికి వస్తే… లక్షకు పైగా అభిమానులు అక్కడికి చేరుకునే అవకాశాలు కనిపిస్తుండగా, పాస్ కొరకు ఫ్యాన్ క్లబ్ ల మధ్యే పోటీలు మొదలై… ఈవెంట్ చుట్టూ పండగ వాతావరణం ఏర్పడుతోంది.

అలాగే నిన్న జరిగిన వుమెన్స్ వరల్డ్ కప్ ఫైనల్ సమయంలో SSMB29 ప్రమో వచ్చింది. ఆ మ్యాచ్‌ను 30 కోట్ల మందికి పైగా చూశారట. అలాంటి మ్యాచ్‌లో, అందరూ ఉత్కంఠగా చూస్తున్న టైంలో… ఎవ్వరు చానల్ మార్చరు. కాబట్టి ఆ ప్రమో జనాల్లో దూసుకెళ్లి కూర్చుంది!

అది ఏం యాదృచ్చికం కాదు… ఇండియా ఫైనల్‌కు రాకపోయినా, వచ్చే ఇండియా–ఆస్ట్రేలియా T20 మ్యాచ్‌ల్లో ప్రమో ప్లాన్ చేసారట. కానీ అదృష్టం, ప్లానింగ్ రెండూ కలిసి రావడంతో రాజమౌళి టీంకి డబుల్ వినింగ్ మోమెంట్!

ఇప్పుడు ఈ బజ్ ఇదే అయితే… నవంబర్ 15 న ఏ స్థాయిలో వేడుక ఉంటుంది అనేది ఊహించడమే రోమాంచితం! రాజమౌళి, ఆయన కుమారుడు కార్తికేయ… మార్కెటింగ్ లో మ్యాజిషియన్స్. అందుకే రాబోయే రోజులు మరింత గ్రాండ్, మరింత అద్భుతం!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

🔔 Subscribe for Latest Articles
Share: FacebookX/TwitterTelegramWhatsAppLinkedInReddit