టాలీవుడ్ యంగ్ హీరో నాగ చైతన్య ఎప్పుడు కొత్త కాన్సెప్ట్స్ తో మన ముందు వస్తాడు… లేటెస్ట్ గా NC 24 సినిమా కూడా ఆ కోవకి చెందినదే… ఈ స్టోరీ మొత్తం ఒక మిస్టరీ చుట్టూ తిరుగుతుందంట… అలాగే హీరోయిన్ మీనాక్షి పాత్ర కూడా చాల ఇంపార్టెంట్ అంటున్నారు…
ఈ సినిమా కి ‘విరూపాక్ష’ ఫేం కార్తిక్ దండు దర్శకత్వం వహిస్తుండగా, SVCC & సుకుమార్ రైటింగ్స్ కలిసి ఎంతో అంబిషస్ గా ఈ ప్రాజెక్ట్ ని రూపొందిస్తున్నారు.
ఇప్పటికే రిలీజ్ చేసిన గ్లింప్స్ తో సినిమా మీద భారీ హైప్ ఏర్పడింది. ఇక ఈరోజు హీరోయిన్ మీనాక్షి చౌదరి ఫస్ట్ లుక్ ను అన్‌వీల్ చేశారు. తనని ‘దక్షా’ గా పరిచయం చేసాడు నాగ చైతన్య… దక్ష ఈ సినిమాలో ఆర్కియాలజిస్ట్ గా కనిపించనుంది.
పోస్టర్ లో ఫీల్డ్ గేర్ వేసుకుని, కళ్లద్దాలు పెట్టుకుని, చేతిలో మ్యాగ్నిఫయింగ్ గ్లాస్ తో… ఒక గుహలో పురాతన వస్తువులను పరిశీలిస్తూ కనిపిస్తుంది. మిస్టరీని ఛేదించడానికి సిద్ధమైన దక్షా గా భలే ఉంది…
ఇక ఈ సినిమా తో ‘Laapatha Ladies’ ఫేం స్పర్శ్ శ్రీవాస్తవ ఈ సినిమాతో టాలీవుడ్ లో అడుగు పెడుతున్నారు. ప్రస్తుతం సినిమా షూట్ హైదరాబాద్ లో జరుగుతోంది.